BREAKING
జిల్లా పొలిటికల్ అవేర్‌నెస్ చైర్‌పర్సన్‌గా సుదా గణపతి.. రాష్ట్ర స్ట్రాంగ్ మెన్ టైటిల్ విజేత మారే వీరేంద్ర… రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల పరిశీలన పీఏసీఎస్‌ల సమస్యల పరిష్కారానికి చర్యలు పులి పాదముద్రల గుర్తింపు బాక్సాఫీస్ వద్ద అజయ్ దేవగన్ దృశ్యం 3 మేనియా.. ఆరో రోజు కూడా తగ్గని జోరుతో రూ. 230 కోట్ల కలెక్షన్లు! 25 ఏళ్ళు గా దేశాభివృద్ధికి అంకితమై ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా ఎమ్మెల్యే నల్లమిల్లి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా సేవా ప్రస్థానానికి అభినందనలు..శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. రామ్‌చరణ్ - సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్ అప్డేట్.. దసరాకు పూజా కార్యక్రమాలు, షూటింగ్ ఎప్పుడంటే? వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అంగన్వాడీ ఉత్సవాలు ముగింపు -- పలువురికి సత్కారాలు సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ఆల్వాల్ లో ఘనంగా సేవా జ్యోతి కార్యక్రమం.. వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఎంప్లాయిస్ చేసే ధర్నాకు... ఏపీ ఎన్ జి జీవోస్ మద్దతు* పేకాట వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే సత్తి విమర్శలు.

ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా ఎమ్మెల్యే నల్లమిల్లి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ.

Select Suryaa Now
ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా ఎమ్మెల్యే నల్లమిల్లి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ.

అనపర్తి మేజర్ న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని అనపర్తి నియోజకవర్గంలో కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో సేవాజ్యోతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రామవరం నుంచి అనపర్తి వరకు సుమారు 1000 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామవరం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ అనపర్తికి చేరుకుంది. అనంతరం అనపర్తి దేవీ చౌక్ నుంచి గాంధీ బొమ్మ వరకు కూటమి శ్రేణులు కాగడాలతో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రజా ప్రస్థానం ప్రారంభమై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా అనపర్తి నియోజకవర్గంలో కూటమి ఆధ్వర్యంలో సేవాజ్యోతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించినట్లు చెప్పారు. 25 సంవత్సరాల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రజా జీవితంలో నిరంతరం కొనసాగుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, అనంతరం భారత ప్రధానమంత్రిగా దేశ ప్రజలకు సేవలందిస్తున్నారని తెలిపారు.దేశ రక్షణ, సంక్షేమం, ఆరోగ్యం, సాంకేతిక రంగాలతో పాటు వివిధ రంగాల్లో అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని నల్లమిల్లి అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ఆర్థిక, ఆరోగ్య రంగాల్లో కూడా అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో భాగంగా అనపర్తి నియోజకవర్గంలో రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, అంగన్‌వాడీ ఉత్సవాలు తదితర సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు చెప్పారు. ప్రజా సేవకు ప్రాధాన్యతనిస్తూ నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. సేవాజ్యోతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.