BREAKING
రాష్ట్ర స్ట్రాంగ్ మెన్ టైటిల్ విజేత మారే వీరేంద్ర… రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల పరిశీలన పీఏసీఎస్‌ల సమస్యల పరిష్కారానికి చర్యలు పులి పాదముద్రల గుర్తింపు బాక్సాఫీస్ వద్ద అజయ్ దేవగన్ దృశ్యం 3 మేనియా.. ఆరో రోజు కూడా తగ్గని జోరుతో రూ. 230 కోట్ల కలెక్షన్లు! 25 ఏళ్ళు గా దేశాభివృద్ధికి అంకితమై ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా ఎమ్మెల్యే నల్లమిల్లి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా సేవా ప్రస్థానానికి అభినందనలు..శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. రామ్‌చరణ్ - సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్ అప్డేట్.. దసరాకు పూజా కార్యక్రమాలు, షూటింగ్ ఎప్పుడంటే? వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అంగన్వాడీ ఉత్సవాలు ముగింపు -- పలువురికి సత్కారాలు సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ఆల్వాల్ లో ఘనంగా సేవా జ్యోతి కార్యక్రమం.. వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఎంప్లాయిస్ చేసే ధర్నాకు... ఏపీ ఎన్ జి జీవోస్ మద్దతు* పేకాట వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే సత్తి విమర్శలు. జిల్లా మెడికల్ అధికారిని కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి*

పులి పాదముద్రల గుర్తింపు

Select Suryaa Now
పులి పాదముద్రల గుర్తింపు

ఏలూరు మేజర్ర్ న్యూస్:  గోదావరి, ఏలూరు జిల్లాల పరిధిలోని తాళ్లపూడి, గోపాలపురం, పోలవరం మండలాల్లో పెద్దపులి సంచరించరిస్తోందనే సమాచారంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. గతంలో దానికి అమర్చిన జీపీఎస్ ట్రాకర్ ఆధారంగా పులి ఎటువైపునకు వెళ్తుందో తెలుసుకున్న అటవీశాఖ అధికారులు స్థానిక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. సీతానగరం నుంచి గోదావరి నదిని దాటుకుంటూ ఏలూరు జిల్లా పోలవరం మండలం గూటాల మీదుగా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గోపవరం మీదుగా వెళ్లి అక్కడి నుంచి తిరిగి తాళ్లపూడి మండలం బయ్యవరం, తుపాకులగూడెం, రాగోలపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించినట్లు పాదముద్రల ఆధారంగా గుర్తించారు. జీపీఎస్ ట్రాకర్‌ ఆధారంగా ప్రతి మూడు, అయిదు గంటలకోసారి పెద్దపులి కదలికల ఆధారంగా ఎక్కడుందో తెలుస్తోందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. తాళ్లపూడి మండలంలోని బయ్యవరం, రాగోలపల్లి తుపాకులగూడెం నుంచి ఒక రైతుకు చెందిన ఆయిల్‌పామ్‌ తోట నుంచి పాత్రునిచెరువు ఆయకట్టు పరిధి మీదుగా ఎలుగుకొండ ఎక్కినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పెద్దపులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి జల్లెడ పడుతున్నారు. తెల్లవారు జామునే పంటపొలాలకు రైతులు, కూలీలు వెళ్లవొద్దని అటవీశాఖ, 'రెవెన్యూ, పంచాయతీ, పోలీసుల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో దండోరా వేయించారు. ఈ పరిసరాల ప్రాంతాల పరిధిలో కొండ ప్రాంతాలు ఉండటంతో పులి సంచరించే అవకాశం ఉందని, చీకటి పడిన తర్వాత ఎవరూ బయటకు రావొద్దని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. పెద్దపులి కదలికను తెలుసుకునేందుకు 15 కెమెరాలను అమర్చామని, ఒక బోను సిద్ధం చేశామని డిప్యూటీ రేంజ్ అధికారి ఎ. సూరిబాబు తెలిపారు.

 జిల్లా ఇంచార్జ్ పసుమర్తి రాము ఏలూరు