అంగన్వాడీ ఉత్సవాలు ముగింపు -- పలువురికి సత్కారాలు
నరసాపురం రూరల్, మేజర్ న్యూస్ :గత నెల 27 నుండి నిర్వహించిన అంగన్వాడి వారోత్సవాలు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా పలువురు అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్లను సత్కరించారు. మండలంలోని దర్బరేవు, వేములదీవి వెస్ట్, ఈస్ట్ గ్రామాలలోని సచివాలయాల్లో ముగింపు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ సిహెచ్ దుర్గ భవాని మాట్లాడుతూ పోషకాహారాంతోనే పిల్లలు భవిష్యత్తు ఆరోగ్యంగా ఉంటుందని, తల్లిదండ్రులు పిల్లలకు ఇంటిలో చేసిన ఆహారాన్ని అందించాలన్నారు. తిరుమని దావీదురాజు మాట్లాడుతూఅమ్మ ఒడి నుండి అంగన్వాడీ కి వస్తారని వచ్చే పిల్లల్ని అంగన్వాడీ కార్యకర్తలు ఆట పాటలతో విద్య అందిస్తున్నారని,కార్యకర్తలు చేసే సేవలు గుర్తించి కూటమి నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తిరుమని శ్రీరామ్, మల్లాడి లక్ష్మణ స్వామి, మల్లాడి అర్జున్ రావు. ఎన్ఎం, ఆశ, ఎంల్ ఛ్పి తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ ఇజ్రాయిల్ నరసాపురం పశ్చిమగోదావరి జిల్లా,