BREAKING
విదేశీ ఐటీ ఔట్‌సోర్సింగ్ సంస్థలపై యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం: మణిపూర్‌లో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి మద్దతు .. త్రికోట శివాలయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం* ఎన్నికల సామగ్రి అప్పగించే వరకు పోలింగ్ విధులు కొనసాగాల్సిందే: గుజరాత్ ఎన్నికల సంఘం స్పష్టీకరణ! పశ్చిమాసియాలో సడలిన ఉద్రిక్తతలు: జూన్ ఆటో అమ్మకాల్లో జోరు: టీవీఎస్ సేల్స్ 47 శాతం, బజాజ్ ఆటో 28 శాతం జంప్.. అంచనాలను మించిన వృద్ధి! అమెరికాకు అసాధారణ ప్రతిభావంతులు మాత్రమే కావాలి: నేటి రాశి ఫలాలు: 9 అక్టోబర్ 2026 నేటి పంచాంగం: 9 అక్టోబర్ 2026 శుక్రవారం పిఆర్టియు నారాయణపేట మండల అధ్యక్షులుగా మొల్గాన్ జనార్ధన్ 5 వ వార్డులో తడి పొడి కి చెత్త బుట్టలు పంపిణీ జర్నలిస్టులు నిజాయితీగా వార్తలు రాయాలి.. తప్పుడు కథనాలు రాస్తే శిక్షార్హులు.. పోలీసులు, మీడియా సమన్వయంతో పనిచేయాలి : ఎస్పీ వినీత్ సాకి చెరువు కట్టపై బతుకమ్మ వేడుకలకు భారీ ఏర్పాట్లు హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ సినిమాకు భారీ నష్టం.. ఏకంగా రూ.1,350 కోట్లు గల్లంతు! ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం*

వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

Select Suryaa Now
వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

 అనపర్తి మేజర్ న్యూస్. అనపర్తి గ్రామంలో  శ్రీశ్రీశ్రీ వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా, మండల స్థాయి నాయకుల సమక్షంలో నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ ఎం. రాము, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గెల్లా రాజు ముఖ్య అతిథులుగా హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. 

అధ్యక్షులుగా కొవ్వూరి చంద్రశేఖర్ రెడ్డి, కార్యదర్శిగా మానేపల్లి మహేష్, గౌరవ అధ్యక్షులుగా వీరభద్రరావు, ఓబులాపురం నరసింహారావు, కోశాధికారిగా ఓబులాపురం నాగలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షులుగా పైల శ్రీహరి, నాతి రవి, సంయుక్త కార్యదర్శిగా నిడదవోలు నరేష్, సంయుక్త కోశాధికారిగా ఎం. సరిత, పీఆర్‌ఓగా సతీష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వానపల్లి వనజ, టెక్నికల్ ఇన్‌చార్జిగా ఎం. శివ సుబ్రహ్మణ్యం బాధ్యతలు చేపట్టారు. 

బోర్డు సభ్యులుగా కొవ్వూరి ఉదయ భాస్కర్ రెడ్డి, సీరం సుబ్రహ్మణ్యం, సురేష్ కుమార్, వి. సుబ్బారావు, దిలీప్ ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా ఎం. రాము మాట్లాడుతూ ఫోటో, వీడియోగ్రాఫర్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, సభ్యుల సంక్షేమానికి ఐకమత్యంతో పనిచేయాలని సూచించారు. గెల్లా రాజు మాట్లాడుతూ నూతన కార్యవర్గం సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి యూనియన్ నాయకులు, ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు.