ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా సేవా ప్రస్థానానికి అభినందనలు..శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు.
ముమ్మిడివరం మేజర్ న్యూస్ మురమళ్ల క్యాంపు కార్యాలయం నుంచి మార్కెట్ సెంటర్ వరకు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ర్యాలీగా పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ దాట్ల సుబ్బరాజు గారు మాట్లాడుతూ, ప్రజా జీవితంలోకి ప్రవేశించి సుమారు 25 సంవత్సరాలుగా దేశ ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం దేశానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ దేశ అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు ఆయన విశేష కృషి చేశారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అందిస్తున్న సహాయ సహకారాలు ఎంతో కీలకమని ఎమ్మెల్యే తెలిపారు. రానున్న రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని, ముమ్మిడివరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ గుత్తుల సాయి, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీ వెంకటరెడ్డి, జనసేన నాయకులు శ్రీ జిమ్మీ, శ్రీ దుర్గాప్రసాద్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని “సేవా జ్యోతి యాత్ర”ను విజయవంతం చేశారు.