నేడు జిల్లా సాయి షూటింగ్ బాల్
జూనియర్ బాలుర ఎంపికలు...
స్టేషన్ ఘనపూర్ ప్రతినిధి
నేటి గురువారం స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని శ్రీవాణి గురుకులంలో మధ్యాహ్నం 2 గంటలకు జూనియర్ బాలుర సెలెక్షన్స్ ఉంటాయని జనగామ జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్
జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నెపు కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇక్కడ సెలక్షన్ అయిన క్రీడాకారులు ఈ నెల 10.11.12 తేదీలలో మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు.
సెలక్షన్ కు వచ్చే క్రీడాకారులు
ఎస్ఎస్ సి మెమో,ఆధార్ కార్డు తమ వెంట తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. వయస్సు 20 సంవత్సరాల
లోపు ఉండాలని పేర్కొన్నారు.
ఈ ఎంపికలో పాల్గొను విద్యార్థులు
9010255898,
8106703282,
8178650006,
9000623012
నెంబర్లను సంప్రదించాలని
తెలియజేశారు.