BREAKING
జిల్లా పొలిటికల్ అవేర్‌నెస్ చైర్‌పర్సన్‌గా సుదా గణపతి.. రాష్ట్ర స్ట్రాంగ్ మెన్ టైటిల్ విజేత మారే వీరేంద్ర… రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల పరిశీలన పీఏసీఎస్‌ల సమస్యల పరిష్కారానికి చర్యలు పులి పాదముద్రల గుర్తింపు బాక్సాఫీస్ వద్ద అజయ్ దేవగన్ దృశ్యం 3 మేనియా.. ఆరో రోజు కూడా తగ్గని జోరుతో రూ. 230 కోట్ల కలెక్షన్లు! 25 ఏళ్ళు గా దేశాభివృద్ధికి అంకితమై ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా ఎమ్మెల్యే నల్లమిల్లి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా సేవా ప్రస్థానానికి అభినందనలు..శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. రామ్‌చరణ్ - సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్ అప్డేట్.. దసరాకు పూజా కార్యక్రమాలు, షూటింగ్ ఎప్పుడంటే? వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అంగన్వాడీ ఉత్సవాలు ముగింపు -- పలువురికి సత్కారాలు సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ఆల్వాల్ లో ఘనంగా సేవా జ్యోతి కార్యక్రమం.. వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఎంప్లాయిస్ చేసే ధర్నాకు... ఏపీ ఎన్ జి జీవోస్ మద్దతు* పేకాట వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే సత్తి విమర్శలు.

అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి

Select Suryaa Now
అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి

 

*** తహసిల్దార్ టి స్వరూపారాణి కి  వినతిపత్రం అందచేత.

*** బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు సట్ల రవి గౌడ్ .

*** బి ఆర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి..
టేకుమట్ల ప్రతినిధి, టేకుమట్ల మండలంలోని చలివాగు, మానేరు వాగు పరివాహక ప్రాంతం నుండి ప్రతిరోజు వందలాది ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమ రవాణాలను చేస్తున్నారని, ఇసుక అక్రమ రవాణా నివారించడంలో సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, తక్షణమే  అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు సట్ల రవి గౌడ్, ఆకునూరి  తిరుపతి స్థానిక తాసిల్దార్ టి స్వరూపా రాణి కి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుత ఎల్ నీనో ప్రభావంతో అతి తక్కువ వర్షపాతం నమోదయిందని, చలి వాగు, మానేరు వాగు నుంచి ఇసుకను అక్రమ రవాణా చేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతాయని, రాబోయే రోజుల్లో ప్రజలకు త్రాగునీరు కరువు అయ్యే పరిస్థితి నెలకొందని తక్షణమే సంబంధిత అధికారులు ఇట్టి విషయంపై తగిన చర్యలు చేపట్టి అక్రమ రవాణాను నివారించగలరని టిఆర్ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు సట్ల రవి గౌడ్, ఆకునూరు తిరుపతి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బందెల నరేష్, పింగిలి వెంకటేశ్వర్ రెడ్డి, టేకుమట్ల సర్పంచ్ మాట్ల శ్రీనివాస్, టేకుమట్ల టౌన్ అధ్యక్షులు నిమ్మల స్వామి తదితరులు పాల్గొన్నారు.