BREAKING
విదేశీ ఐటీ ఔట్‌సోర్సింగ్ సంస్థలపై యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం: మణిపూర్‌లో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి మద్దతు .. త్రికోట శివాలయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం* ఎన్నికల సామగ్రి అప్పగించే వరకు పోలింగ్ విధులు కొనసాగాల్సిందే: గుజరాత్ ఎన్నికల సంఘం స్పష్టీకరణ! పశ్చిమాసియాలో సడలిన ఉద్రిక్తతలు: జూన్ ఆటో అమ్మకాల్లో జోరు: టీవీఎస్ సేల్స్ 47 శాతం, బజాజ్ ఆటో 28 శాతం జంప్.. అంచనాలను మించిన వృద్ధి! అమెరికాకు అసాధారణ ప్రతిభావంతులు మాత్రమే కావాలి: నేటి రాశి ఫలాలు: 9 అక్టోబర్ 2026 నేటి పంచాంగం: 9 అక్టోబర్ 2026 శుక్రవారం పిఆర్టియు నారాయణపేట మండల అధ్యక్షులుగా మొల్గాన్ జనార్ధన్ 5 వ వార్డులో తడి పొడి కి చెత్త బుట్టలు పంపిణీ జర్నలిస్టులు నిజాయితీగా వార్తలు రాయాలి.. తప్పుడు కథనాలు రాస్తే శిక్షార్హులు.. పోలీసులు, మీడియా సమన్వయంతో పనిచేయాలి : ఎస్పీ వినీత్ సాకి చెరువు కట్టపై బతుకమ్మ వేడుకలకు భారీ ఏర్పాట్లు హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ సినిమాకు భారీ నష్టం.. ఏకంగా రూ.1,350 కోట్లు గల్లంతు! ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం*

ట్రాన్స్ ఫారం రిపేరింగ్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏఎంసీ చైర్మన్ పంతకాని తిరుమల

Select Suryaa Now
ట్రాన్స్ ఫారం రిపేరింగ్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏఎంసీ చైర్మన్ పంతకాని తిరుమల

 

కాటారం ప్రతినిధి, కాటారం డివిజన్ కేంద్రంలోని ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల్లో జరుగుతున్న జాప్యంపై రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ పంతకాని తిరుమల సమ్మయ్య బుధవారం రిపేరింగ్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె కేంద్రంలోని రికార్డులను, అందుబాటులో ఉన్న సామగ్రిని పరిశీలించి, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు.అనంతరం చైర్మన్ తిరుమల సమ్మయ్య మాట్లాడుతూ ఈ ప్రాంత రైతాంగానికి ఎలాంటి సాగునీటి, కరెంటు కష్టాలు ఉండకూడదనే ఉద్దేశంతో గౌరవ రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో ఈ రిపేరింగ్ సెంటర్‌ను ఇక్కడ ఏర్పాటు చేయించారని గుర్తుచేశారు. రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, నిర్దేశిత సమయంలోగా ట్రాన్స్ఫార్మర్లను రిపేర్ చేసి క్షేత్రస్థాయికి పంపాలని సిబ్బందిని ఆదేశించారు., మరమ్మతుల పేరుతో రైతుల వద్ద ఎలాంటి అదనపు రుసుములు, లంచాలు వసూలు చేయకూడదని కచ్చితంగా స్పష్టం చేశారు.సెంటర్ పరిధిలో ఉన్న లోపాలను, ఆలస్యానికి గల కారణాలను తెలుసుకున్న ఆమె, వెంటనే విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ (డీఈ) కి ఫోన్ చేసి మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న సాంకేతిక, విద్యుత్ పరమైన సమస్యలన్నింటినీ రాబోయే వారం రోజుల్లోగా పరిష్కరించి, నిరంతర విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ పిల్లమరి రమేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, మండల ప్రచార కమిటీ చైర్మన్ కుంభం రమేష్ రెడ్డి, ఆత్మకూరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.