BREAKING
పీ4 స్ఫూర్తికి ఘన విజయం.. కృపారావుకు బంగారు పతకం సీతమ్మవారి పాదాల వద్ద భక్తుల సౌకర్యాల పరిశీలన ఇంద్రకీలాద్రిపై పచ్చదనం, ఘాట్‌రోడ్ పనుల పరిశీలన అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం మహిళలకు కుట్టుమిషన్ల అందజేత ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఓటర్ల జాబితాపై మరోసారి ఇంటింటి పరిశీలన బాలల స్నేహపూర్వక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా మీ ఆహార సేవకు అమ్మ ఆశీస్సులుండాలి.. : ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ మహోత్సవాలకు మహా సన్నాహాలు... - మూడు ప్ర‌ధాన ఉత్స‌వాల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు గుంతలు లేని నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలి : కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడలో ఐదు అర్బన్ క్రెచ్‌లు - రూ.50 లక్షలతో ఏర్పాటు.. రూ.45 లక్షలు డోనర్ సంస్థ సహకారం వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు - 22 రోజుల సహాయ నిరాకరణపై రెవెన్యూ మంత్రి హామీ

విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్, కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

Select Suryaa Now
విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్, కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

సూర్య కరీంనగర్ ప్రతినిధి :కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీపురం, మల్కాపూర్ గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే ధ్యేయంగా పోలీసులు విస్తృతంగా 'కార్డన్ అండ్ సెర్చ్' (Cordon and Search) తో పాటు 'కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం' (Community Contact Programme) నిర్వహించారు. రూరల్ ఏసీపీ విజయకుమార్ పర్యవేక్షణలో, కొత్తపల్లి పోలీసు స్టేషన్ అధికారి ఇన్‌స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు బుధవారం సాయంత్రం ఈ తనిఖీలు చేపట్టాయి.

గ్రామాల్లోని ప్రతి వీధిని జల్లెడ పట్టిన పోలీసులు, అనుమానిత వ్యక్తుల వివరాలు ఆరా తీశారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను తనిఖీ చేసి, నిబంధనలు పాటించని వారిపై చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా రూరల్ ఏసీపీ విజయకుమార్ గ్రామస్తులతో మాట్లాడుతూ... ప్రజల భద్రత కోసమే ఈ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. గ్రామాల్లో అపరిచిత లేదా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సైబర్ నేరాలు, మోసపూరిత లింకులు, ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరిస్తూ, కాలనీలు, వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాలను అరికట్టవచ్చని సూచించారు.

ఇన్‌స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్ మాట్లాడుతూ... శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా పోలీసుల దృష్టికి తీసుకురావచ్చని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కొత్తపల్లి ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ బలగాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి.