BREAKING
ఇంద్రకీలాద్రిపై పచ్చదనం, ఘాట్‌రోడ్ పనుల పరిశీలన అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం మహిళలకు కుట్టుమిషన్ల అందజేత ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఓటర్ల జాబితాపై మరోసారి ఇంటింటి పరిశీలన బాలల స్నేహపూర్వక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా మీ ఆహార సేవకు అమ్మ ఆశీస్సులుండాలి.. : ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ మహోత్సవాలకు మహా సన్నాహాలు... - మూడు ప్ర‌ధాన ఉత్స‌వాల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు గుంతలు లేని నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలి : కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడలో ఐదు అర్బన్ క్రెచ్‌లు - రూ.50 లక్షలతో ఏర్పాటు.. రూ.45 లక్షలు డోనర్ సంస్థ సహకారం వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు - 22 రోజుల సహాయ నిరాకరణపై రెవెన్యూ మంత్రి హామీ సిద్ధార్థ ఫ్లైఓవర్‌పై చీకట్లు.. ప్రమాదాలకు ఆహ్వానం కృష్ణా వర్సిటీ మహిళా చెస్ ఛాంపియన్షిప్‌లో కేబీఎన్ కళాశాలకు విజయం

శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా కమిషనరేట్ వ్యాప్తంగా విస్తృత నాకాబందీ

Select Suryaa Now
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా కమిషనరేట్ వ్యాప్తంగా విస్తృత నాకాబందీ

 సూర్య కరీంనగర్ ప్రతినిధి :కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు నేరాల నియంత్రణ, అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కమిషనరేట్ పరిధిలో బుధవారం రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు విస్తృత నాకాబందీ, వాహన తనిఖీలు నిర్వహించారు.

కరీంనగర్ టౌన్, కరీంనగర్ రూరల్, హుజూరాబాద్ డివిజన్లలోని ప్రధాన కూడళ్లు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, సున్నిత ప్రాంతాల్లో ఏకకాలంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

ఈ ఆపరేషన్‌లో 3 మంది ఏసీపీలు, 15 మంది సీఐలు, 27 మంది ఎస్సైలు, 54 మంది ఏఎస్సైలు/హెడ్ కానిస్టేబుళ్లు, 130 మంది కానిస్టేబుళ్లు, ట్రాఫిక్ విభాగానికి చెందిన 6 మంది సిబ్బంది, అలాగే SAT విభాగానికి చెందిన 6 మంది ఎస్సైలు, 18 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

కరీంనగర్ టౌన్‌లో ఎన్టీఆర్ జంక్షన్, బోట్ జంక్షన్, బస్టాండ్, గీతాభవన్ సెంటర్, పద్మానగర్ జంక్షన్, ఆదర్శ్‌నగర్ తదితర ప్రాంతాల్లో, కరీంనగర్ రూరల్‌లో బొమ్మకల్, తీగలగుట్టపల్లి, రేకుర్తి, అలుగునూర్, చింతకుంట, మానకొండూర్, గంగాధర తదితర ప్రాంతాల్లో, హుజూరాబాద్ డివిజన్‌లో హుజూరాబాద్, పరకాల క్రాస్ రోడ్, కేశవపట్నం, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలతో పాటు అనుమానాస్పద వాహనాలను ఆపి వాహన పత్రాలు, నంబర్ ప్లేట్లు, డ్రైవింగ్ లైసెన్సులు తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అక్రమ రవాణా, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడమే ఈ ప్రత్యేక తనిఖీల ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు.

ప్రజల భద్రత దృష్ట్యా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ధ్రువపత్రాలు కలిగి ఉండాలని, పోలీసుల తనిఖీలకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.