BREAKING
పీ4 స్ఫూర్తికి ఘన విజయం.. కృపారావుకు బంగారు పతకం సీతమ్మవారి పాదాల వద్ద భక్తుల సౌకర్యాల పరిశీలన ఇంద్రకీలాద్రిపై పచ్చదనం, ఘాట్‌రోడ్ పనుల పరిశీలన అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం మహిళలకు కుట్టుమిషన్ల అందజేత ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఓటర్ల జాబితాపై మరోసారి ఇంటింటి పరిశీలన బాలల స్నేహపూర్వక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా మీ ఆహార సేవకు అమ్మ ఆశీస్సులుండాలి.. : ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ మహోత్సవాలకు మహా సన్నాహాలు... - మూడు ప్ర‌ధాన ఉత్స‌వాల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు గుంతలు లేని నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలి : కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడలో ఐదు అర్బన్ క్రెచ్‌లు - రూ.50 లక్షలతో ఏర్పాటు.. రూ.45 లక్షలు డోనర్ సంస్థ సహకారం వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు - 22 రోజుల సహాయ నిరాకరణపై రెవెన్యూ మంత్రి హామీ

మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు గుర్తుగా తాడిగడపలో సేవా జ్యోతి యాత్ర - ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ

Select Suryaa Now
మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు గుర్తుగా తాడిగడపలో సేవా జ్యోతి యాత్ర  - ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ

తాడిగడప, మేజర్ న్యూస్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజా సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా జ్యోతి యాత్రలో భాగంగా తాడిగడప మున్సిపాలిటీలో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో సేవా జ్యోతి యాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ 25 ఏళ్లుగా ప్రజా సేవకు అంకితమైన ప్రధాని మోదీ ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్నారు. దేశ అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం కీలకమని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు, రైల్వే ప్రాజెక్టులు, అమరావతి రాజధాని అభివృద్ధి, జాతీయ రహదారులు, కేంద్ర సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రానికి అందుతున్న సహకారం ప్రాధాన్యమైనదని తెలిపారు. కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వంలో, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నాయని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రతి కుటుంబానికి చేరువ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఇదే స్ఫూర్తితో మరెన్నో సంవత్సరాలు దేశానికి సేవలందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

✍️ప్రేమ్ రాజ్, తాడిగడప, కృష్ణాజిల్లా.