BREAKING
మెరుగైన సేవలందించడమే రెవెన్యూ యంత్రాంగం ప్రధాన లక్ష్యం..జాయింట్ కలెక్టర్ . నైడియా దేవి.. విద్యార్థులకు అయోడిన్‌ పరీక్షలు :నగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి ఆర్.పావని పూడికతీత, పారిశుధ్య పనులు వేగవంతం చేయాలి... జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. సోలార్‌ విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోండి :ఎమ్మెల్యే బండారు వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో టెండర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మానసిక వైద్య సేవలు. వెంకన్న ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి :వాడపల్లి దేవస్థాన ట్రస్ట్ బోర్డు సాధారణ సమావేశం నేటి రాశి ఫలాలు – 8 అక్టోబర్ 2026 (గురువారం) నేటి పంచాంగం – 8 అక్టోబర్ 2026 (గురువారం) పీ4 స్ఫూర్తికి ఘన విజయం.. కృపారావుకు బంగారు పతకం సీతమ్మవారి పాదాల వద్ద భక్తుల సౌకర్యాల పరిశీలన ఇంద్రకీలాద్రిపై పచ్చదనం, ఘాట్‌రోడ్ పనుల పరిశీలన అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం

పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు

Select Suryaa Now
పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు

రావులపాలెం మేజర్ న్యూస్ : పొలం గ్రామానికి చెందిన సంఘం ది, కానీ సాంకేతిక లోపంతో వేరొకరు రిజిస్ట్రేషన్ చేయించుకుని తమదంటూ పేర్కొంటూ న్నారు. వివరాలు ప్రకారం మండల పరిధిలోని ఈతకోట గ్రామంలో గల బాబా నగర్ కాలనీకి చెందిన దళితుల సామాజిక అవసరాల కొరకు తరతరాల నుండి వస్తున్న భూమి. ఆ భూమిని సాంకేతిక లోపంతో వేరొక రిజిస్ట్రేషన్ చేయించుకుని తమదంటూ ఉన్నారని గ్రామ మాజీ ఉపసర్పంచ్ ఏనుగుపల్లి నాగార్జున ఆరోపించారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 60 సంవత్సరాలు పైబడి తమ సామాజిక అవసరాన్ని నిమిత్తం వాడుకుంటూ ఈ భూమిని పూర్వం నుండి కొంతమంది పెద్దల ఆధీనంలో ఉండేదని, తదుపరి ప్రభుత్వ వారి చేయించిన సర్వేలో భాగంగా దానిని వేరే పేర్లు  తో సాంకేతికంగా తప్పు పడిందని కానీ నేడు అది శాపంగా మారిందని ఆయన పేర్కొన్నారు.
మా కాలనీలో 300 దళిత కుటుంబాలు ఉంటు న్నాయి. కాలనీకి సంబంధించి సర్వే నంబర్ 177-6లో 55 సెంట్ల కొబ్బరి తోట ఉంది. దీనిలో అంగన్వాడీ కేంద్రం, సామాజిక భవనం ఉన్నాయి. ఆ భూమి కాలనీకి సంబంధించిన పట్టా వెర్రియ్య, గడ్డం పల్లయ్య పేర్లతో రిజిస్టర్ అయి ఉంది. వారిద్దరూ 30 సంవత్సరాల క్రితమే మరణించారు. 

ఇప్పటి వరకూ కాలనీకి చెందిన పెద్దలు ఆ భూమిని కౌలుకు ఇచ్చి సాగు చేయిస్తున్నారు. వచ్చిన డబ్బులను కాలనీ అభివృద్ధికి ఉపయోగి స్తున్నారు. గతంలో చేపట్టిన సమగ్ర భూ సర్వేలో ఈ భూమికి సంబంధించిన సర్వే నంబర్ గ్రామా నికి చెందిన నక్కా లక్ష్మి ఖాతా నంబర్ 701లో నమోదైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ భూమిని నక్కా లక్ష్మి, ఆమె కుమారులు నరసింహ మూర్తి, సత్యనారాయణమూర్తి, మురళీకృష్ణ కలసి లక్ష్మి కుమార్తె పీతల బిజిలీకి పసుపు కుంకం మాన్యంగా రావులపాలెం సబ్ రిజిస్ట్రార్ కార్యాల యంలో గతంలో రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు
నక్కా లక్ష్మి ముగ్గురు కుమారులు ప్రభు త్వోద్యోగులు తమ భూమి కాదని తెలిసి, రికార్డుల్లో జరిగిన పొరపాటును తమకు అనుకూ లంగా మార్చుకొని, మా కాలనీ భూమిని అక్రమం గా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆ కుటుంబంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ ఫిర్యాదు చేసినట్లు వారు పేర్కొన్నారు.