BREAKING
పూడికతీత, పారిశుధ్య పనులు వేగవంతం చేయాలి... జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. సోలార్‌ విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోండి :ఎమ్మెల్యే బండారు వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో టెండర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మానసిక వైద్య సేవలు. వెంకన్న ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి :వాడపల్లి దేవస్థాన ట్రస్ట్ బోర్డు సాధారణ సమావేశం నేటి రాశి ఫలాలు – 8 అక్టోబర్ 2026 (గురువారం) నేటి పంచాంగం – 8 అక్టోబర్ 2026 (గురువారం) పీ4 స్ఫూర్తికి ఘన విజయం.. కృపారావుకు బంగారు పతకం సీతమ్మవారి పాదాల వద్ద భక్తుల సౌకర్యాల పరిశీలన ఇంద్రకీలాద్రిపై పచ్చదనం, ఘాట్‌రోడ్ పనుల పరిశీలన అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం మహిళలకు కుట్టుమిషన్ల అందజేత ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు

సోలార్‌ విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోండి :ఎమ్మెల్యే బండారు

Select Suryaa Now
సోలార్‌ విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోండి :ఎమ్మెల్యే బండారు

కొత్తపేట,మేజర్ న్యూస్:విద్యుత్‌ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సోలార్‌ విద్యుత్‌ ఎంతో ఉపయోగకరమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.కొత్తపేటలో పీఎం సూర్యఘర్‌ బిజిలీ యోజనపై నిర్వహించిన సేవా సేతు అభియాన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.నియోజకవర్గానికి 3,365 సోలార్‌ యూనిట్లకు అవకాశం కల్పించగా ఇప్పటివరకు 679 మంది మాత్రమే వినియోగించుకున్నారని తెలిపారు.

అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.మార్చి నెలాఖరు వరకు మాత్రమే సబ్సిడీ అందుబాటులో ఉంటుందని,అనంతరం సబ్సిడీ ఉండదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఎస్సీ,ఎస్టీ లబ్ధిదారులకు 2 కిలోవాట్ల వరకు ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు.సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటుతో విద్యుత్‌ బిల్లుల భారం తగ్గడంతో పాటు లో-వోల్టేజ్‌ సమస్యలు కూడా తగ్గుతాయని తెలిపారు.

సేవా సేతు శిబిరాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఆన్‌-ది-స్పాట్‌ నమోదు, విద్యుత్‌ సమస్యల పరిష్కారం చేపడుతున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో   కంఠంశెట్టి శ్రీనివాసరావు, గనిశెట్టి వీరేష్,కడలి భీమా,విద్యుత్‌ శాఖ ఈఈ కొత్తపల్లి రాంబాబు,డీఈఈ డి.చిట్టిరాజు,ఏఈలు ఎస్‌.శ్రీరామకృష్ణ,టి.అశోక్‌,పి.నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.