వెంకన్న ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి :వాడపల్లి దేవస్థాన ట్రస్ట్ బోర్డు సాధారణ సమావేశం
ఆత్రేయపురం మేజర్ న్యూస్ కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు లు అన్నారు బుధవారం ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులతో సాధారణ సమావేశం నిర్వహించారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు (గబ్బర్ సింగ్) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలపై చర్చించి ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించారు ఈ సందర్భంగా శ్రీ స్వామి వారి 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల ది.29-10-2026 నుండి ది.06-11-2026 వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్ణయించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పూల అలంకరణలు, మాడవీధులు మరియు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్ల కోసం టెండర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సిందిగా ధర్మకర్తల మండలి సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.అదేవిధంగా తొమ్మిది రోజుల పాటు జరిగే శ్రీ స్వామి వారి వాహన సేవల సందర్భంగా భక్తులకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని అందించేందుకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ వాయిద్య బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా వాడపల్లి మరియు పరిసర ప్రాంతాల నుండి భక్తులను ఆలయానికి తరలించేందుకు ఉచిత బస్సుల సౌకర్యాన్ని కల్పించేందుకు కూడా సభ్యులు తీర్మానం చేశారు అలాగే ది.01-09-2026 నుండి ది.30-09-2026 వరకు ఆలయ జమా-ఖర్చుల వివరాలను పరిశీలించి ఆమోదించారు. దేవస్థాన అవసరాల నిమిత్తం ఒక టాటా ఏస్, అప్పి వాహనాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దేవస్థానం లో జరిగిన పలు టెండర్లను పరిశీలించి ఆమోదించడం జరిగింది వచ్చే ది.20-12-2026న జరిగే ముక్కోటి ఏకాదశి మహోత్సవం సందర్భంగా అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, దర్శన ఏర్పాట్లు సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి సభ్యులు చలుమూరి రాంబాబు, గంగవరపు పద్మావతి, కాసా చాముండేశ్వరి, కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్, పెండెం కుమారి, పెండ్యాల భవాని, సలాది నాగేశ్వరరావు, ఏపుగంటి విజయకుమారి, చింతపల్లి సత్యనారాయణ, తమ్మన సాయిప్రసాద్, యల్లమిల్లి చంద్రకుమారి, వాడపల్లి సుందర శేషావతారం, మస్కపల్లి త్రిమూర్తులు పాల్గొన్నారు