BREAKING
పూడికతీత, పారిశుధ్య పనులు వేగవంతం చేయాలి... జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. సోలార్‌ విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోండి :ఎమ్మెల్యే బండారు వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో టెండర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మానసిక వైద్య సేవలు. వెంకన్న ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి :వాడపల్లి దేవస్థాన ట్రస్ట్ బోర్డు సాధారణ సమావేశం నేటి రాశి ఫలాలు – 8 అక్టోబర్ 2026 (గురువారం) నేటి పంచాంగం – 8 అక్టోబర్ 2026 (గురువారం) పీ4 స్ఫూర్తికి ఘన విజయం.. కృపారావుకు బంగారు పతకం సీతమ్మవారి పాదాల వద్ద భక్తుల సౌకర్యాల పరిశీలన ఇంద్రకీలాద్రిపై పచ్చదనం, ఘాట్‌రోడ్ పనుల పరిశీలన అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం మహిళలకు కుట్టుమిషన్ల అందజేత ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు

వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో టెండర్లు

Select Suryaa Now
వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో టెండర్లు

ఆత్రేయపురం మేజర్ న్యూస్ కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం  పలు టెండర్లను నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో కొబ్బరి చెక్కలను పోగు చేసుకొని హక్కు నిర్వహణకు సంబంధించిన వార్షిక టెండర్‌లో తిమ్మాపురం గ్రామానికి చెందిన శ్రీ పవన్ సూర్య ట్రేడర్స్ అత్యధికంగా రూ. 2,03,49,999కు పాట దక్కించుకున్నారు.. దీంతో గత సంవత్సరం కంటే రూ. 40,16,666 అదనపు ఆదాయం దేవస్థానానికి సమకూరినట్లు అధికారులు తెలిపారు 

శ్రీ స్వామివారికి నిర్వహించే నిత్య పూల అలంకరణ టెండర్‌ను వాడపల్లి గ్రామానికి చెందిన పైడికొండల వీరబాబు దక్కించుకున్నారు. తులాభారం నిర్వహణకు సంబంధించి సరైన టెండర్ రాకపోవడంతో ఆ టెండర్‌ను వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే శ్రీ స్వామివారి చిత్రపటాలు, జూట్ బ్యాగులు, వార్షిక క్యాలెండర్లు, లడ్డు కవర్లు తదితర అంశాలకు సంబంధించిన వివిధ టెండర్లను ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో నిర్వహించారు 

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు  ఆలయ డిప్యూటీ కమిషనర్ & కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధరరావు రాజమహేంద్రవరం దేవదాయశాఖ తనిఖీదారులు ఎస్. శైలజ, లక్ష్మీ, పోలవరం గ్రూప్ టెంపుల్స్ ఈఓ బి. కిరణ్, ధర్మకర్తల మండలి సభ్యులు చలుమూరి రాంబాబు గంగవరపు పద్మావతి, కాసా చాముండేశ్వరి, కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్, పెండెం కుమారి, పెండ్యాల భవాని, సలాది నాగేశ్వరరావు, ఏపుగంటి విజయకుమారి, చింతపల్లి సత్యనారాయణ, తమ్మన సాయిప్రసాద్, యల్లమిల్లి చంద్రకుమారి, వాడపల్లి సుందర శేషావతారం, మస్కపల్లి త్రిమూర్తులు, ఆలయ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు