విద్యార్థులకు అయోడిన్ పరీక్షలు :నగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి ఆర్.పావని
మామిడికుదురు మేజర్ న్యూస్: మండల పరిధిలో నగరం హై స్కూల్ మరియు మోడల్ పాఠశాలలో బుధవారం ఎంపిక చేసిన పలువురు విద్యార్థులకు యూరిన్, అయోడిన్ పరీక్షలు నిర్వహించినట్లు నగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి ఆర్.పావని తెలిపారు..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... అయోడిన్ తక్కువ ఉన్న వారు అయోడిన్ ఉప్పు వాడాలని సూచించారు. అయోడిన్ లోపం కారణంగా మానసికంగా, శారీరకంగా ఎదుగుదల లోపం ఉంటుందని అయోడిన్ సరైన మోతాదులో తీసుకోవాలని అవగాహన కల్పించారు.నిత్య జీవితంలో ఉప్పు ప్రాముఖ్యత అందులోని అయోడిన్ పదార్థ విశిష్టతను వివరించారు. లక్షణాలు, లాభ నష్టాల గురించి అవగాహన కల్పించారు.
6 - 12 సంవత్సరాల లోపు పిల్లలకు అనగా 1 నుండి 6 వ తరగతి చదువు పిల్లలకు మొత్తం 90 మంది పిల్లలను టార్గెట్ గా తీసుకుని సర్వే చేశారు .90 మంది పిల్లలకు గాయిటర్ పరీక్ష చేయగా, 9 మంది నుండి యూరినరీ శాంపిల్ కలెక్ట్ చేసి వీటిని జిల్లా ఆఫీసు కి పంపించి అక్కడ స్టేట్ ల్యాబ్ కు పంపించి రిజల్ట్ తీసుకోవడం జరుగుతుందనీ ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్లు బి. నరసింహ రావు, పి. భాగ్యవతి,ప్రధానోపాధ్యాయులు బి. నాగేశ్వర రావు, వైద్య సిబ్బంది ఎస్ సూరిబాబు, జే.సునీత, కే.చంద్ర కుమారి, మరియు ఆశా వర్కర్ లు పాల్గొన్నారు.