BREAKING
జిల్లా పరిషత్ బరిలోచెల్లుబోయిన ఇప్పటికే చెల్లుబోయినకు అధిష్టానం ఆదేశాలు.. మెరుగైన సేవలందించడమే రెవెన్యూ యంత్రాంగం ప్రధాన లక్ష్యం..జాయింట్ కలెక్టర్ . నైడియా దేవి.. విద్యార్థులకు అయోడిన్‌ పరీక్షలు :నగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి ఆర్.పావని పూడికతీత, పారిశుధ్య పనులు వేగవంతం చేయాలి... జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. సోలార్‌ విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోండి :ఎమ్మెల్యే బండారు వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో టెండర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మానసిక వైద్య సేవలు. వెంకన్న ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి :వాడపల్లి దేవస్థాన ట్రస్ట్ బోర్డు సాధారణ సమావేశం నేటి రాశి ఫలాలు – 8 అక్టోబర్ 2026 (గురువారం) నేటి పంచాంగం – 8 అక్టోబర్ 2026 (గురువారం) పీ4 స్ఫూర్తికి ఘన విజయం.. కృపారావుకు బంగారు పతకం సీతమ్మవారి పాదాల వద్ద భక్తుల సౌకర్యాల పరిశీలన ఇంద్రకీలాద్రిపై పచ్చదనం, ఘాట్‌రోడ్ పనుల పరిశీలన అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం

మెరుగైన సేవలందించడమే రెవెన్యూ యంత్రాంగం ప్రధాన లక్ష్యం..జాయింట్ కలెక్టర్ . నైడియా దేవి..

Select Suryaa Now
మెరుగైన సేవలందించడమే రెవెన్యూ యంత్రాంగం ప్రధాన లక్ష్యం..జాయింట్ కలెక్టర్ . నైడియా దేవి..

అమలాపురం మేజర్ న్యూస్ ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందించడంతో పాటు, భూ సంబంధిత సమస్యలను సత్వరం పరిష్కరించడమే లక్ష్యంగా రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవి ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని  గోదావరి భవన్ నందు కొత్తపేట, అమలాపురం, రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో నిర్వహించిన రెవెన్యూ అధికారుల సమావేశంలో డివిజన్ పరిధిలోని వివిధ రెవెన్యూ అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రీ-సర్వే, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియను నిర్దేశిత నిబంధనల ప్రకారం వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. భూ రికార్డులలో ఎలాంటి తప్పులు, అవకతవకలు లేకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులైన రైతులు, భూ యజమానులకు సకాలంలో సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నియోజవర్గంలో డివిజన్ మండల గ్రామ స్థాయి లో పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని వీఆర్వోలకు సర్వేయర్లకు ఆదేశించారు.
22(ఏ) కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, పెండింగ్‌లో ఉన్న కేసులను నిబంధనల మేరకు పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా, ప్రతి దరఖాస్తును నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలన్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవసపై సమీక్షిస్తూ, ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును అధికారులు బాధ్యతగా స్వీకరించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యతతో పాటు వేగం కూడా ముఖ్యమని, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి న్యాయబద్ధంగా పరిష్కారం చూపాలని అన్నారు.
ప్రతి కేసుకు సంబంధించిన వివరాలను సకాలంలో ఆన్‌లైన్‌లో నమోదు చేసి, రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని అధికారులను ఆదేశించారు.
రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, పాత రికార్డులను భద్రపరచడంతో పాటు డిజిటల్ రికార్డులు కూడా సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భూ రికార్డుల నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు.భూ కేటాయింపులు, భూసేకరణ ప్రతిపాదనల పెండెన్సీని తగ్గించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ అవసరాలకు సంబంధించిన భూ ప్రతిపాదనలను నిబంధనల మేరకు పరిశీలించి, అవసరమైన నివేదికలను నిర్ణీత సమయంలో సమర్పించాలని ఆదేశించారు.
కొత్తపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారంలో సాధించిన ముఖ్యమైన విజయాలు, ఉత్తమ విధానాలు, పెండింగ్ సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను ఆర్డీవోలు, తహసీల్దార్లు సమావేశంలో వివరించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన రెవెన్యూ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ లక్ష్య సాధనలో ప్రతి రెవెన్యూ అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని జాయింట్ కలెక్టర్  స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో డి ఆర్ ఓ వి. సుబ్బారావు,ల్యాండ్ మరియు సర్వే అధికారి కె ప్రభాకర్ తహసీల్దార్లు, సర్వే మరియు ల్యాండ్ అధికారులు, వి ఆర్ ఓ లు తదితరులు పాల్గొన్నారు