జిల్లా పరిషత్ బరిలోచెల్లుబోయిన ఇప్పటికే చెల్లుబోయినకు అధిష్టానం ఆదేశాలు..
అమలాపురం మేజర్ న్యూస్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిషత్ బిసి రిజర్వుడు అయితే వైసీపీ సీనియర్ నేత చెల్లుబోయిన శ్రీనివాస్ ను రంగంలోకి దించే యోచనలో ఉంది. మున్సిపల్ ప్రతిపక్ష నేతగా సమర్ధవంతంగా పనిచేసిన ఆయన గత జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో నడిపూడి గ్రామపంచాయతీలో తన ఓటు హక్కు నమోదు చేసుకున్నారు.
అయితే అప్పుడు అమలాపురం నియోజకవర్గం లో మూడు జడ్పీటీసీ లు ఎస్ సి రిజర్వుడు కావడంతో ఆయనకు పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఈసారి అధిష్టానమే ఒక నిర్ణయానికి రావడంతో చెల్లుబోయిన సుముఖత వ్యక్తం చేశారు.
సుప్రీం కోర్టు తీర్పు రిజర్వేషన్లపై ఎలా ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం 34 శాతం బీసీలకు సీట్లు కోసం అవసరం అయితే ఓ సి సీట్ల లో ఇస్తామన్న ప్రతిపాదన తమకు కలిసి వచ్చే అవకాశం అని చెల్లుబోయిన భావిస్తున్నారు. మాజీ మంత్రి విశ్వరూప్ కు అత్యంత సన్నిహితుడు అయినా చెల్లుబోయిన వివాదాలుకు దూరం.
అన్నీ కులాల్లో తో స్నేహం గా ఉంటూ ఎటువంటి దర్పం ప్రదర్శించని నేతగా ఏదిగారు.