BREAKING
పచ్చదనంతో ఆంధ్రప్రదేశ్‌ను సస్యశ్యామలం చేద్దాం : ఏపీ గ్రీన్‌ కమిటీ ఛైర్మన్‌ నాగబాబు అమలాపురం గడియార స్తంభం వద్ద ఘనంగా 'సేవా జ్యోతి యాత్ర... శ్రీ సత్యదేవ నర్సరీలో బ్లాక్‌ వేప మొక్క నాటినఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొణిదల నాగబాబు జాతీయ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో కోనసీమ విద్యార్థిని సాహితి తేజకు స్వర్ణ పతకం ఉరితాళ్లతో వీఆర్ఏల వినూత్న నిరసన: పెరవలిలో 22వ రోజుకు చేరిన సమ్మె! అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా అన్న సమారాధన జిల్లా పరిషత్ బరిలోచెల్లుబోయిన ఇప్పటికే చెల్లుబోయినకు అధిష్టానం ఆదేశాలు.. మెరుగైన సేవలందించడమే రెవెన్యూ యంత్రాంగం ప్రధాన లక్ష్యం..జాయింట్ కలెక్టర్ . నైడియా దేవి.. విద్యార్థులకు అయోడిన్‌ పరీక్షలు :నగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి ఆర్.పావని పూడికతీత, పారిశుధ్య పనులు వేగవంతం చేయాలి... జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. సోలార్‌ విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోండి :ఎమ్మెల్యే బండారు వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో టెండర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మానసిక వైద్య సేవలు. వెంకన్న ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి :వాడపల్లి దేవస్థాన ట్రస్ట్ బోర్డు సాధారణ సమావేశం నేటి రాశి ఫలాలు – 8 అక్టోబర్ 2026 (గురువారం)

అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా అన్న సమారాధన

Select Suryaa Now
అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా అన్న సమారాధన

. అనపర్తి మేజర్ న్యూస్. అనపర్తి: ఆంధ్ర శబరిమలగా ప్రసిద్ధి చెందిన అనపర్తి గ్రామంలోని శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయంలో బుధవారం భక్తులకు ఘనంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

 ఆలయ కమిటీ సభ్యులు సబ్బెళ్ళ సత్యనారాయణ రెడ్డి, తేతలి త్రినాథ్ రెడ్డి పర్యవేక్షణలో అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్తి రామకృష్ణారెడ్డి, ప్రతి ధనలక్ష్మి కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారం అందించడంతో భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన వితరణ చేపట్టారు. భక్తులకు భోజనాన్ని సాదరంగా వడ్డించి అయ్యప్ప స్వామి వారి ప్రసాదంగా అందించారు. అన్న సమారాధనకు ముందు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. 

స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్ల నిర్వహణ, అన్నదాన ప్రాంగణంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు, తాగునీరు తదితర ఏర్పాట్లను పర్యవేక్షించారు. అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి వారి కృపతో భక్తులకు సేవ చేసే అవకాశం లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని, భక్తులకు నిరంతరం ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు.