BREAKING
పెరవలిలో ఒంటరి మహిళ ఇంట్లో అర్ధరాత్రి దోపిడీ : చేతులు, కాళ్లు కట్టేసి దాడి.. బంగారం, నగదు అపహరణ ఖండవల్లిలో అంగన్వాడీ సెక్టార్ సమావేశం పచ్చదనంతో ఆంధ్రప్రదేశ్‌ను సస్యశ్యామలం చేద్దాం : ఏపీ గ్రీన్‌ కమిటీ ఛైర్మన్‌ నాగబాబు అమలాపురం గడియార స్తంభం వద్ద ఘనంగా 'సేవా జ్యోతి యాత్ర... శ్రీ సత్యదేవ నర్సరీలో బ్లాక్‌ వేప మొక్క నాటినఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొణిదల నాగబాబు జాతీయ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో కోనసీమ విద్యార్థిని సాహితి తేజకు స్వర్ణ పతకం ఉరితాళ్లతో వీఆర్ఏల వినూత్న నిరసన: పెరవలిలో 22వ రోజుకు చేరిన సమ్మె! అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా అన్న సమారాధన జిల్లా పరిషత్ బరిలోచెల్లుబోయిన ఇప్పటికే చెల్లుబోయినకు అధిష్టానం ఆదేశాలు.. మెరుగైన సేవలందించడమే రెవెన్యూ యంత్రాంగం ప్రధాన లక్ష్యం..జాయింట్ కలెక్టర్ . నైడియా దేవి.. విద్యార్థులకు అయోడిన్‌ పరీక్షలు :నగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి ఆర్.పావని పూడికతీత, పారిశుధ్య పనులు వేగవంతం చేయాలి... జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. సోలార్‌ విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోండి :ఎమ్మెల్యే బండారు వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో టెండర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మానసిక వైద్య సేవలు.

అమలాపురం గడియార స్తంభం వద్ద ఘనంగా 'సేవా జ్యోతి యాత్ర...

Select Suryaa Now
అమలాపురం గడియార స్తంభం వద్ద ఘనంగా 'సేవా జ్యోతి యాత్ర...

అమలాపురం  మేజర్ న్యూస్ పట్టణంలోని గడియార స్తంభం వద్ద "సేవా జ్యోతి యాత్ర" కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమలాపురం శాసనసభ్యులు ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేతిలో సేవా జ్యోతిని పట్టుకుని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కొంతదూరం పాదయాత్రగా నడిచారు.
​అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ... భారత ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం ప్రజాసేవలో 25 సంవత్సరాల సుదీర్ఘమైన, అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం దేశ ప్రజలందరికీ ఎంతో గర్వకారణమని కొనియాడారు.

 గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు, దేశ ప్రధానిగా 12 ఏళ్లుగా నిరాటంకంగా, సమర్థవంతమైన పాలన అందిస్తూ భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుపుతున్నారని పేర్కొన్నారు.​ప్రధాని మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, మౌలిక వసతుల కల్పన ముమ్మరంగా సాగుతోందని తెలిపారు. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీలు కలిసి పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దినదినాభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. 

మోదీ తీసుకుంటున్న సంక్షేమ, అభివృద్ధి నిర్ణయాలు ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయని, ఆయన నిరంతర శ్రమ, నిష్కళంకమైన సేవ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.​ఈ కార్యక్రమంలో అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, గంధం పల్లంరాజు  యాళ్ళ దొరబాబు, అడబాల సత్యనారాయణ, మానేపల్లి అయ్యాజీ వేమా, నల్లా శ్రీధర్, కల్వకొలను తాతాజీ, కర్రి చిట్టిబాబు, నల్లా పవన్, మోకా సుబ్బారావు, నల్లా స్వామి, తిక్కిరెడ్డి నేతాజీ, నల్లా మల్లి తదితరులు పాల్గొన్నారు.ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.