ఖండవల్లిలో అంగన్వాడీ సెక్టార్ సమావేశం
పెరవలి మేజర్ న్యూస్ :తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లిలో అక్టోబర్ 7వ తేదీ బుధవారం న అంగన్వాడీ సెక్టార్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలు, కార్యక్రమాల అమలు తదితర అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా తమ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ విశిష్ట సేవలు అందిస్తున్న ముగ్గురు అంగన్వాడీ కార్యకర్తలను బెస్ట్ అంగన్వాడీ వర్కర్లుగా ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు.
ఖండవల్లి అంగన్వాడీ టీచర్ దాసరి దుర్గాదేవి, అన్నవరప్పాడు అంగన్వాడీ టీచర్ ఓసూరి రామలక్ష్మి, కడింపాడు అంగన్వాడీ టీచర్ మాలతిలను సెక్టార్ సమావేశంలో శాలువాలతో సత్కరించి అభినందించారు.అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్యాభివృద్ధితో పాటు గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ గుర్తింపు లభించిందని నిర్వాహకులు తెలిపారు. తమ సేవలను గుర్తించి సన్మానించడం పట్ల అవార్డు పొందిన అంగన్వాడీ టీచర్లు సంతోషం వ్యక్తం చేశారు.