BREAKING
పెరవలిలో ఒంటరి మహిళ ఇంట్లో అర్ధరాత్రి దోపిడీ : చేతులు, కాళ్లు కట్టేసి దాడి.. బంగారం, నగదు అపహరణ ఖండవల్లిలో అంగన్వాడీ సెక్టార్ సమావేశం పచ్చదనంతో ఆంధ్రప్రదేశ్‌ను సస్యశ్యామలం చేద్దాం : ఏపీ గ్రీన్‌ కమిటీ ఛైర్మన్‌ నాగబాబు అమలాపురం గడియార స్తంభం వద్ద ఘనంగా 'సేవా జ్యోతి యాత్ర... శ్రీ సత్యదేవ నర్సరీలో బ్లాక్‌ వేప మొక్క నాటినఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొణిదల నాగబాబు జాతీయ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో కోనసీమ విద్యార్థిని సాహితి తేజకు స్వర్ణ పతకం ఉరితాళ్లతో వీఆర్ఏల వినూత్న నిరసన: పెరవలిలో 22వ రోజుకు చేరిన సమ్మె! అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా అన్న సమారాధన జిల్లా పరిషత్ బరిలోచెల్లుబోయిన ఇప్పటికే చెల్లుబోయినకు అధిష్టానం ఆదేశాలు.. మెరుగైన సేవలందించడమే రెవెన్యూ యంత్రాంగం ప్రధాన లక్ష్యం..జాయింట్ కలెక్టర్ . నైడియా దేవి.. విద్యార్థులకు అయోడిన్‌ పరీక్షలు :నగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి ఆర్.పావని పూడికతీత, పారిశుధ్య పనులు వేగవంతం చేయాలి... జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. సోలార్‌ విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోండి :ఎమ్మెల్యే బండారు వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో టెండర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మానసిక వైద్య సేవలు.

శ్రీ సత్యదేవ నర్సరీలో బ్లాక్‌ వేప మొక్క నాటినఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొణిదల నాగబాబు

Select Suryaa Now
శ్రీ సత్యదేవ నర్సరీలో బ్లాక్‌ వేప మొక్క నాటినఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొణిదల నాగబాబు

కడియం ,మేజర్ న్యూస్ :శ్రీ సత్య దేవా నర్సరీ తో ఎన్నో సంవత్సరం అనుబంధం ఉందని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొణిదల నాగబాబు తెలిపారు కడియం మండలం కడియపులంకలోని శ్రీ సత్యదేవ నర్సరీని సందర్శించిన  నాగబాబు ముందుగా అరుదైన బ్లాక్‌ వేప మొక్కను నాటారు. అనంతరం శ్రీ సత్యదేవ నర్సరీ అధినేత  పుల్ల పెద్ద సత్యనారాయణ అరుదైన మొక్కను నాగబాబుకు అందించి ఆత్మీయంగా స్వాగతం పలికారు.

పెద్ద సత్యనారాయణ నర్సరీలోని వివిధ రకాల మొక్కలను నాగబాబుకు చూపిస్తూ వాటి ప్రత్యేకతలు, పెరుగుదల, నాణ్యత, మార్కెట్‌ డిమాండ్‌ తదితర వివరాలను వివరించారు. ఆయన కూడా అంతే ఆసక్తిగా పలు రకాల మొక్కల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం నర్సరీలోని ఒకటి నుంచి మూడు సంవత్సరాల వయసు కలిగిన స్థానిక మొక్కలతో పాటు మలేషియా గ్రీన్‌ కొబ్బరి, బనానా మ్యాంగో తదితర మొక్కల గురించి కూడా నాగబాబు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.


నర్సరీలో పనిచేస్తున్న మహిళా సిబ్బందితోనూ నాగబాబు ముచ్చటించి వారి పని, ఉపాధి అవకాశాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పుల్ల పెద్ద సత్యనారాయణతో కలిసి నర్సరీలో మొక్కలను పరిశీలించి ఫొటోలు దిగారు. అనంతరం నర్సరీ నాగబాబు సంచరించారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా డీఎఫ్‌ఓ ప్రభాకరరావు, రీసెర్చ్‌ డీఎఫ్‌ఓ శ్రీనివాస్‌, ఎఫ్‌ఆర్‌ఓ దావీద్‌ రాజు, నర్సరీ అసోసియేషన్ అధ్యక్షులు బొరుసు సుబ్బారాయుడు, అసోసియేషన్ పాలకవర్గ సభ్యులు,  ఏపీ ఏఐసిసి డైరెక్టర్ మార్గాన సత్యనారాయణ,గట్టి నరసయ్య, గెడ్డం  శివ, ముద్రగడ జమ్మి, బోడపాటి గోపి,ఆదిమూలం సాయిబాబా, అన్నం దేవుల చంటి,పుల్లా ఆంజనేయులు,పుల్లా పెద్ద సత్యనారాయణ, పళ్ళ  సుబ్రహ్మణ్యం, బొరుసు  సుబ్రహ్మణ్యం, గాద నాగేశ్వరరావు, సింగంశెట్టి శ్రీనివాస్,
ఎమ్మార్వో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.