BREAKING
పెరవలిలో ఒంటరి మహిళ ఇంట్లో అర్ధరాత్రి దోపిడీ : చేతులు, కాళ్లు కట్టేసి దాడి.. బంగారం, నగదు అపహరణ ఖండవల్లిలో అంగన్వాడీ సెక్టార్ సమావేశం పచ్చదనంతో ఆంధ్రప్రదేశ్‌ను సస్యశ్యామలం చేద్దాం : ఏపీ గ్రీన్‌ కమిటీ ఛైర్మన్‌ నాగబాబు అమలాపురం గడియార స్తంభం వద్ద ఘనంగా 'సేవా జ్యోతి యాత్ర... శ్రీ సత్యదేవ నర్సరీలో బ్లాక్‌ వేప మొక్క నాటినఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొణిదల నాగబాబు జాతీయ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో కోనసీమ విద్యార్థిని సాహితి తేజకు స్వర్ణ పతకం ఉరితాళ్లతో వీఆర్ఏల వినూత్న నిరసన: పెరవలిలో 22వ రోజుకు చేరిన సమ్మె! అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా అన్న సమారాధన జిల్లా పరిషత్ బరిలోచెల్లుబోయిన ఇప్పటికే చెల్లుబోయినకు అధిష్టానం ఆదేశాలు.. మెరుగైన సేవలందించడమే రెవెన్యూ యంత్రాంగం ప్రధాన లక్ష్యం..జాయింట్ కలెక్టర్ . నైడియా దేవి.. విద్యార్థులకు అయోడిన్‌ పరీక్షలు :నగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి ఆర్.పావని పూడికతీత, పారిశుధ్య పనులు వేగవంతం చేయాలి... జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. సోలార్‌ విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోండి :ఎమ్మెల్యే బండారు వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో టెండర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మానసిక వైద్య సేవలు.

పచ్చదనంతో ఆంధ్రప్రదేశ్‌ను సస్యశ్యామలం చేద్దాం : ఏపీ గ్రీన్‌ కమిటీ ఛైర్మన్‌ నాగబాబు

Select Suryaa Now
పచ్చదనంతో ఆంధ్రప్రదేశ్‌ను సస్యశ్యామలం చేద్దాం : ఏపీ గ్రీన్‌ కమిటీ ఛైర్మన్‌ నాగబాబు

కడియం, మేజర్ న్యూస్ ,:రాష్ట్రాన్ని హరిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక దృష్టితో కృషి చేస్తున్నారని ఏపీ గ్రీన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఛైర్మన్‌ నాగబాబు అన్నారు. కడియం మండలం కడియపులంకలోని సర్‌ ఆర్థర్‌ కాటన్‌ నర్సరీ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ రైతులతో బుధవారం సమావేశమైన ఆయన, రాష్ట్రంలో చేపట్టనున్న భారీ స్థాయి మొక్కల పెంపకం, సేకరణ కార్యక్రమాలపై చర్చించారు.
2026–27 ఆర్థిక సంవత్సరంలో సుమారు 10 కోట్ల మొక్కలను నర్సరీల్లో సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నాగబాబు తెలిపారు. రాష్ట్రంలో 50 శాతం గ్రీన్‌ కవర్‌ సాధించేందుకు కడియం నర్సరీ రైతులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నర్సరీ రైతుల సహకారం అవసరమన్నారు. పట్టణాలు, రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో విస్తృతంగా మొక్కలు నాటేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
నర్సరీ రైతులకు నష్టం కలగకుండా మొక్కల కొనుగోలు చేపట్టి, వారికి స్థిరమైన మార్కెట్‌ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని నాగబాబు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు పచ్చదనం పెంపు ఎంతో కీలకమని అన్నారు.
నర్సరీ రైతులతో సమన్వయంతో ముందుకు: బీఎన్‌ఎన్‌ మూర్తిఏపీ గ్రీన్‌ కమిషనర్‌, సీఈఓ బీఎన్‌ఎన్‌ మూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు పెద్దఎత్తున మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నాణ్యమైన మొక్కలను పెద్దఎత్తున అందుబాటులోకి తీసుకురావడంలో కడియం నర్సరీ రైతుల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వ హరిత కార్యక్రమాలకు అనుగుణంగా నర్సరీ రైతులతో సమన్వయం చేసుకుని ముందుకు సాగుతామని, వారికి మార్కెట్‌ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ సందర్భంగా కడియం నర్సరీ రైతులు ప్రభుత్వ హరిత కార్యక్రమాలకు తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా డీఎఫ్‌ఓ ప్రభాకరరావు, రీసెర్చ్‌ డీఎఫ్‌ఓ శ్రీనివాస్‌, ఎఫ్‌ఆర్‌ఓ దావీద్‌ రాజు, నర్సరీ అసోసియేషన్ అధ్యక్షులు బొరుసు సుబ్బారాయుడు, అసోసియేషన్ పాలకవర్గ సభ్యులు,  గట్టి నరసయ్య, గెడ్డం  శివ, ముద్రగడ జమ్మి, బోడపాటి గోపి,ఆదిమూలం సాయిబాబా, అన్నం దేవుల చంటి,పుల్లా ఆంజనేయులు,పుల్లా పెద్ద సత్యనారాయణ, పళ్ళ  సుబ్రహ్మణ్యం, బొరుసు  సుబ్రహ్మణ్యం, గాద నాగేశ్వరరావు,ఎమ్మార్వో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.