BREAKING
21 కి.మీ ఎత్తులో డీఆర్‌డీవో హై-ఆల్టిట్యూడ్ ఎయిర్‌షిప్ పరీక్ష విజయవంతం: దేశీయ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ‘సెర్వావాక్’కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు... కెన్యాలో తొలి ఎబోలా కేసు నిర్ధారణ: చికిత్స పొందుతూ రోగి మృతి.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌వో! ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి :ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు వినతిపత్రం పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు నేటి రాశి ఫలాలు – 7 అక్టోబర్ 2026 (బుధవారం) మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి నేటి పంచాంగం 7 అక్టోబర్ 2026,బుధవారం ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి గిరిజన చట్టాలకు తూట్లు పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

Select Suryaa Now
శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

వరంగల్, అక్టోబర్ 6, మేజర్ న్యూస్ సూర్య,

ఓరుగల్లులోని ప్రాచీనమైన దేవాలయాల్లో ఒకటైన, కాకతీయుల ఆరాధ్య దైవం శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మంగళవారం ఆవిష్కరించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె చేతుల మీదుగా ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దేవాలయ వంశపారంపర్య అర్చకులు నాగిళ్ల శంకర్ శర్మ శరన్నవరాత్రి ఉత్సవాల విశిష్టత, ఆలయ ప్రాశస్త్యం, ఉత్సవాల్లో నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాల గురించి కలెక్టర్‌కు వివరించారు.
శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, దేవాలయ దర్శనానికి వచ్చే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించేలా సంబంధిత జిల్లా అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.