ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
ఉర్సు రావణాసుర వధ కార్యక్రమం విజయవంతం చేయాలి
తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ
వరంగల్ లీగల్: అక్టోబర్ 6: మేజర్ న్యూస్ (సూర్య)
వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం ఉర్సు లో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, మాజీ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. మంగళవారం దసరా ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్కమిషనర్ శ్వేతా రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, అధికారులతో ఏర్పాట్లను సమీక్షించారు. బతుకమ్మ దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించి ప్రజలకి ముఖ్యంగా మహిళలు వృద్ధులు పిల్లలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు నాగపురి సంజయ్, మేడిది మధుసూదన్, వడ్నాల నరేందర్, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్ కాంగ్రెస్ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ శామంతుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.