ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి :ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు వినతిపత్రం
అల్లవరం మేజర్ న్యూస్.అల్లవరం మండలంలో వివిధ గ్రామాల్లో పనిచేయుచున్న ఆశావర్కర్లు గోడి గ్రామంలో ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయం నందు బొమ్మి ఇజ్రాయిల్ ని కలిసి వారి సమస్యల గురించి వినతిపత్రం సమర్పించడం జరిగింది.
ముఖ్యంగా ఆశావర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని, పర్మినెంట్ చేయాలని, అన్ని రకాల సెలవులు మంజూరు చేయాలని, మట్టి ఖర్చులు ఇవ్వాలని, నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలని, శిక్షణ పొందిన ఏఎన్ఎమ్స్ జిఎన్ఎమ్ లకు పర్మినెంట్ పోస్టులు భర్తీ సందర్భంగా ప్రాధాన్యత కల్పించాలని, పెరుగుతున్న జనాభా అనుగుణంగా ఆశా వర్కర్ల సంఖ్య పెంచాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కి తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ మాట్లాడుతూ ఆశ వర్కర్ల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చుటకు నా వంతు కృషి చేస్తానని, శాసన మండలిలో మీ సమస్యను పై గళం విప్పి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చుటకు ప్రయత్నిస్తానని తెలియజేశారు.
గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య శాఖకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, అనేక పోస్టులు భర్తీ చేశారని, అప్పట్లో గౌరవ వేతనం 3000 నుండి 10000 రూపాయలు పెంచారని, ప్రతి సంవత్సరం యూనిఫార్మ్స్ అందించారని, స్మార్ట్ ఫోన్స్ అందించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఈ విధమైన యూనిఫామ్స్ అందించడం లేదని, స్మార్ట్ ఫోన్స్ లేవని, శ్రమ ఎక్కువ జీతం తక్కువ అని, ఆశ వర్కర్ల డిమాండ్స్ నెరవేర్చకపోతే వైఎస్ఆర్సిపి పార్టీ తరపున పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ ఆర్.మంగాదేవి,ఈ. నాగమణి,పి.లక్ష్మి కుమారి, ఎస్కే జైన బేబి, పి చంద్రకళ, జి పద్మ, ఏ సత్య కాశి, జె గంగాభవాని, ఎస్ ఎం రత్నకుమారి, యు రత్నకాంతం తదితరులు పాల్గొన్నారు.