BREAKING
21 కి.మీ ఎత్తులో డీఆర్‌డీవో హై-ఆల్టిట్యూడ్ ఎయిర్‌షిప్ పరీక్ష విజయవంతం: దేశీయ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ‘సెర్వావాక్’కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు... కెన్యాలో తొలి ఎబోలా కేసు నిర్ధారణ: చికిత్స పొందుతూ రోగి మృతి.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌వో! ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి :ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు వినతిపత్రం పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు నేటి రాశి ఫలాలు – 7 అక్టోబర్ 2026 (బుధవారం) మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి నేటి పంచాంగం 7 అక్టోబర్ 2026,బుధవారం ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి గిరిజన చట్టాలకు తూట్లు పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

చెత్తను సద్వినియోగం చేసుకోవాలి

Select Suryaa Now
చెత్తను సద్వినియోగం చేసుకోవాలి

గోపాలపురం మేజర్ న్యూస్ అక్టోబర్ 06:గోపాలపురం గ్రామ శివారులోని భీమోలు రోడ్డులో ఉన్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో పారిశుధ్య నిర్వహణపై ఎక్స్‌పోజర్ విజిట్ నిర్వహించారు. ఎంపీడీవో ఆర్. సుజాత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు ఒకరోజు శిక్షణ ఇచ్చారు. చెత్త సేకరణ నుంచి సంపద తయారీ కేంద్రాల్లో దాని శాస్త్రీయ నిర్వహణ వరకు చేపట్టాల్సిన విధానాలను వివరించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో ఆర్. సుజాత మాట్లాడుతూ.. ప్రతి ఇంటి నుంచే తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే విధానాన్ని పక్కాగా అమలు చేయాలని సూచించారు. తడి చెత్తను బిన్ బ్యాగ్ విధానంలో సేకరించి సంపద తయారీ కేంద్రాలకు తరలించాలన్నారు. అక్కడ సుమారు 45 రోజులపాటు శాస్త్రీయ పద్ధతిలో మగ్గించడం ద్వారా నాణ్యమైన వర్మీ కంపోస్టు తయారు చేయవచ్చని తెలిపారు. తయారైన వర్మీ కంపోస్టును సొసైటీల ద్వారా రైతులకు విక్రయించే విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

పొడి చెత్తను తడి చెత్తతో కలపకుండా స్వచ్ఛ రథాల ద్వారా ఇంటింటికీ సేకరించాలని సూచించారు. ప్లాస్టిక్, కాగితం, ఇనుము తదితర పునర్వినియోగ పదార్థాలను విడదీసి సక్రమంగా నిర్వహించాలన్నారు. చెత్తను మూలస్థాయిలోనే వేరు చేసి సేకరించడం ద్వారా గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు తగ్గుతాయని పేర్కొన్నారు.

ప్రజల్లో అవగాహన పెంచేందుకు గ్రామ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాలని ఎంపీడీవో సుజాత సూచించారు. చెత్తను సమస్యగా కాకుండా సంపదగా మార్చే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.