ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి.
రావులపాలెం మేజర్ న్యూస్ :ఆశా వర్కర్లు కు కనీస వేతనాలు చెల్లించాలని, పర్మినెంట్ చేయాలని, అన్ని రకాల సెలవులు మంజూరు చేయాలని, మట్టి ఖర్చులు కూడా ఇవ్వాలని, ఆశా వర్కర్ నియామకాల ప్రభుత్వమే చేపట్టాలని, శిక్షణ పొందిన ఏ ఎన్ ఎం, జి ఎన్ ఎం మ్ లకు పర్మినెంట్ పోస్ట్ సందర్భంగా ప్రాధాన్యత కల్పించాలని, పెరుగుతున్న జనాభా కనుక సంఖ్యను పెంచాలని, కొత్తపేట నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావుకి వినత పత్రం సమర్పించడం జరిగింది.
ఆశా వర్కర్లు లీడర్ల ఆశా వర్కర్స్ కనీస వేతనాలు చెల్లించాలని కొరుచున్నామని .వేతనాలు పెంచి 7 సంవత్సరాలు అయ్యిందని,.పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశావర్కర్స్కు వేతనాలు పెంచాలని కోరుతున్నామని,. 20 సంవత్సరాలుగా ఆరోగ్యశాఖలో పని చేస్తున్న ఆశావర్కర్లకు శెలవులు లేకపోవడంతో అనారోగ్యాల పాలౌతున్నారని, అంగన్వాడీలకు అమలవుతున్న అన్ని రకాల శెలవులు (వేసవి శెలవులు మినహా) ఆశావర్కర్లకు అమలు చేయాలని కోరుచున్నామని,ప్రభుత్వం చెల్లించే .10 వేల రూపాయిలలో నెలలో పిహెచ్సిలకు, ఆసుపత్రులకు వెళ్ళడానికి 3 నుండి 4 వేల రూపాయలు ఖర్చులవుతున్నాయని, సంబంధంలేని పనులు చేయించడం, అధిక జనాభాలో పనిచేయటం వలన ఆశావర్కర్స్ తీవ్ర పని ఒత్తిడికి గురై అనారోగ్యం పాలౌతున్నారని . ఆశావర్కర్స్ సమస్యలు సానుకూలంగా పరిశీలించి ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నామని శాసనసభ్యులు బండారు సత్యానందరావుకి ఇచ్చిన మెమరాండంలో తెలిపారు