BREAKING
మెరుగైన సేవలందించడమే రెవెన్యూ యంత్రాంగం ప్రధాన లక్ష్యం..జాయింట్ కలెక్టర్ . నైడియా దేవి.. విద్యార్థులకు అయోడిన్‌ పరీక్షలు :నగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి ఆర్.పావని పూడికతీత, పారిశుధ్య పనులు వేగవంతం చేయాలి... జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. సోలార్‌ విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోండి :ఎమ్మెల్యే బండారు వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో టెండర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మానసిక వైద్య సేవలు. వెంకన్న ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి :వాడపల్లి దేవస్థాన ట్రస్ట్ బోర్డు సాధారణ సమావేశం నేటి రాశి ఫలాలు – 8 అక్టోబర్ 2026 (గురువారం) నేటి పంచాంగం – 8 అక్టోబర్ 2026 (గురువారం) పీ4 స్ఫూర్తికి ఘన విజయం.. కృపారావుకు బంగారు పతకం సీతమ్మవారి పాదాల వద్ద భక్తుల సౌకర్యాల పరిశీలన ఇంద్రకీలాద్రిపై పచ్చదనం, ఘాట్‌రోడ్ పనుల పరిశీలన అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం

అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే..

Select Suryaa Now
అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే..

అమలాపురం,  మేజర్ న్యూస్ అయోడిన్ లోప రుగ్మతలను గుర్తించి, వాటి నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు జాతీయ అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణ కార్యక్రమం లో భాగంగా 2026–27 సంవత్సరానికి సంబంధించిన  జిల్లా స్థాయి సర్వేను అక్టోబర్ 7ననిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.జాతీయ ఆరోగ్య మిషన్  ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సర్వేలో డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎంపిక చేసిన 30 గ్రామాల్లో గాయిటర్  నిర్ధారణతో పాటు ఉప్పు, మూత్ర నమూనాలను సేకరించనున్నారు.
గ్రామానికి 90 మంది పిల్లల ఎంపిక :సర్వేలో భాగంగా ఎంపిక చేసిన ప్రతి గ్రామం నుంచి 6–12 సంవత్సరాల వయస్సు గల 90 మంది పిల్లలను ఎంపిక చేయనున్నారు. ఇందులో 45 మంది బాలురు, 45 మంది బాలికలు ఉంటారు. ఎంపికైన పిల్లలకు గాయిటర్ పరీక్ష నిర్వహించి, అయోడిన్ లోప రుగ్మతల పరిస్థితిని అంచనా వేయనున్నారు.అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి 18 ఉప్పు నమూనాలు, 9 మూత్ర నమూనాలను సేకరించి రాష్ట్ర స్థాయి  మానిటరింగ్ ల్యాబొరేటరీకి పంపించి పరీక్షలు నిర్వహించనున్నారు.

అయోడిన్ స్థాయిపై ప్రత్యేక పరిశీలన : ప్రజలు వినియోగిస్తున్న అయోడైజ్డ్ ఉప్పులో అయోడిన్ స్థాయిని పరీక్షించడం, పిల్లల్లో యూరినరీ అయోడిన్ ఎక్స్క్రీషన్  స్థాయిని అంచనా వేయడం, జిల్లాలో అయోడిన్ లోప రుగ్మతల స్థాయిని గుర్తించడం సర్వే ప్రధాన ఉద్దేశ్యాలని అధికారులు తెలిపారు. అలాగే అయోడిన్ లోపం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, లోప రుగ్మతల నియంత్రణకు అవసరమైన చర్యలను చేపట్టేందుకు సర్వే ఫలితాలు దోహదపడతాయని పేర్కొన్నారు.
అయోడిన్ లోప రుగ్మతల నివారణఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు బాట” అనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు సహకరించాలని ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆర్‌బీఎస్‌కే & ఎన్‌సీడీ డా. ఎం. సుమలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. దుర్గారావు దొర విజ్ఞప్తి చేశారు.