గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
పి గన్నవరం. మేజర్ న్యూస్ :, పి. గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్–విలేజ్ హెల్త్ క్లినిక్‌ను పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్–విలేజ్ హెల్త్ క్లినిక్‌లను రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్చువల్‌గా ప్రారంభించారని తెలిపారు. ఇందులో భాగంగా అమలాపురం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు తాను, అమలాపురం ఎమ్మెల్యే అయితబత్తుల ఆనందరావు పాల్గొన్నట్లు పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతోగ్రామ ఆరోగ్య క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నరేంద్రపురంలో ఈ క్లినిక్ అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలకు ప్రాథమిక వైద్యం గ్రామంలోనే అందుబాటులోకి వస్తుందన్నారు.
ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న కో లోకేటెడ్ పీహెచ్‌సీ ఏర్పాటుకు సంబంధించి, తాత్కాలికంగా ఈ కేంద్రం ద్వారా వైద్య సేవలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్వరలోనే నరేంద్రపురంలో పూర్తిస్థాయి పీహెచ్‌సీ అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, ప్రభుత్వ అధికారులు మరియు సిబ్బందికి ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.