BREAKING
21 కి.మీ ఎత్తులో డీఆర్‌డీవో హై-ఆల్టిట్యూడ్ ఎయిర్‌షిప్ పరీక్ష విజయవంతం: దేశీయ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ‘సెర్వావాక్’కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు... కెన్యాలో తొలి ఎబోలా కేసు నిర్ధారణ: చికిత్స పొందుతూ రోగి మృతి.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌వో! ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి :ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు వినతిపత్రం పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు నేటి రాశి ఫలాలు – 7 అక్టోబర్ 2026 (బుధవారం) మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి నేటి పంచాంగం 7 అక్టోబర్ 2026,బుధవారం ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి గిరిజన చట్టాలకు తూట్లు పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి

Select Suryaa Now
పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి

*పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాదించిన పోలీసు క్రీడాకారులను అబినందించిన వరంగల్ సీపీ ఎన్.శ్వేతా

హనుమకొండ టౌన్, అక్టోబర్ 6, మేజర్ న్యూస్ సూర్య,

హైదరాబాద్ లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో విధులు నిర్వహిస్తున్న 12 మంది పోలీసు క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. బ్యాడ్మింటన్ ఆటలో ఒక బంగారు పతకము, మూడు బ్రాంజ్ మెడల్స్, టేబుల్ టెన్నిస్ ఆటోలో ఐదు బ్రాంజ్ మెడల్స్, లాండ్ టెన్నిస్ ఆటలో ఒక బ్రాంజ్, ఒక సిల్వర్ మరియు రెండు బ్రాండ్ మొత్తము 12 పథకాలు సాధించారు. పతకాలు సాధించిన ఎ ఆర్ అడిషనల్ డి.సి.పి.వి.శ్రీనివాస్, ఎసిపి.మధుసూదన్, ఎఆర్ ఎసిపి. లు పి.అనంతయ్య, కె. నాగయ్య, ఎసిపి.పి.నర్సయ్య, ఎస్సై. ఎ.సురేష్, మహిళా ఎఎస్సై ఇ.జమునారాణి, మహిళా హెడ్ కానిస్టేబుల్ యన్.స్వర్ణలత, హెడ్ కానిస్టేబుల్ లు యస్.ఓదెలు, శ్రీరాములు, కానిస్టేబుల్ లు కె.వేణుచారి, పి.తులసీదాస్ లు వరంగల్ పోలీస్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారు సాధించిన పతకాలను పరిశీలించిన కమిషనర్  క్రీడాకారులను అభినందించి వారి ప్రతిభను ప్రశంసించారు. పోలీసు విధులను సమర్దవంతంగా నిర్వహంచడంతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి పోలీస్ శాఖకు పేరు తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. విధి నిర్వహణతో పాటు శారీరక దారుఢ్యం, క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సిబ్బందికి సూచించారు. భవిష్యత్తులో  మరిన్ని క్రీడా పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించాలన్నారు.