BREAKING
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో యూఏఈ టాస్ గెలిచి బ్యాటింగ్.. హర్‌ప్రీత్ సెంచరీ, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి - కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావినిల సత్యనారాయణ బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసు వివాదం పరిష్కారం .. 39 ఏళ్ల తర్వాత మర్లపూడిలో టీడీపీ జెండా రెపరెపలు.. విజయానికి యువ నాయకుడు వరదబండి వెంకటేశ్వర్లు రెడ్డి కృషి కీలకం! కష్టాల్లో ఉన్న కుటుంబానికి జిల్లా కలెక్టర్ చేయూత పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం - మోటివేషన్ ట్రైనర్ ఎస్ ధర్మారెడ్డి సూర్యవంశీ సిక్సర్ల సునామీ.. డాక్టర్ తలారి రంగయ్య పై అసత్య ప్రచారాలు తగవు... సిబిఐ విచారణకు సిద్ధమా? దహెగాంలో రావుల మల్లన్న భక్తుల పవిత్ర గంగా స్నానాలు టీడీపీకి బీజేపీ బిగ్ షాక్..! -కూటమిలో కుదరని పొత్తులు..!! మండపం బరిలో ముగ్గురు లక్ష్మీలు...!!! అపస్మా నూతన కార్యవర్గ ఎంపిక ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఏకగ్రీవ సర్పంచ్. కార్మిక హక్కుల రక్షణ కోసం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటి యు ఆధ్వర్యంలో ర్యాలీ ఓటు హక్కు వినియోగించుకోండి వైసీపిని వీడి టీడీపీలోకి భారీగా చేరికలు

టీడీపీకి బీజేపీ బిగ్ షాక్..! -కూటమిలో కుదరని పొత్తులు..!! మండపం బరిలో ముగ్గురు లక్ష్మీలు...!!!

Select Suryaa Now
టీడీపీకి బీజేపీ బిగ్ షాక్..! -కూటమిలో కుదరని పొత్తులు..!! మండపం బరిలో ముగ్గురు లక్ష్మీలు...!!!


(తోటపల్లిగూడూరు, మేజర్ న్యూస్)

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ)లో వి భేదాలు, అసంతృప్తులు తెరపైకి వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎ న్నికలు, సీట్ల సర్దుబాట్ల నేపథ్యం లో టీడీపీ-బీజేపీల మధ్య పొత్తు లు కుదరలేదు. దాంతో నిన్నటి వరకు జగన్ వర్సెస్ కూటమిగా సాగిన రాజకీయ పోరు..నేడు జ రుగుతున్న స్థానిక ఎన్నికల నేప థ్యంలో టీడీపీ వర్సస్ బీజేపీ అ న్న చందంగా మారింది. అందుకు నిలువెత్తు నిదర్శనం డిసెంబర్ 2 వ తేదీన గ్రామ పంచాయతీల ఎ న్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. తోటపల్లి గూడూరు మండలం మండపం పంచాయ తీలో జరుగుతున్న సర్పంచ్ ఎ న్నికల్లో కుదుర్చుకొన్న పొత్తుల్లో భాగంగా కూటమి వర్సెస్ వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య పో టీ వుండాలి. అయితే ఈ పంచా యతీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యులైన టీడీపీ వర్సెస్ వైసీపీల మధ్య పోటీ వుండాలి. అయితే ఈ పంచాయతీలో టీడీ పీ వర్సెస్ భారతీయ జనతా పా ర్టీల మధ్య పోటీ ఏర్పడడం గమ నార్హం. ఫలితంగా ఇక్కడ త్రిము ఖ పోటీ నెలకొంది. ఈ మేరకు బీ జేపీ మద్దతుతో కూటమిలో రెబ ల్ అభ్యర్థిగా తిరకాల విజయ ల క్ష్మి, అలాగే టీడీపీ తరపున తాం డ్ర లక్ష్మి, వైసీపీ మద్దతుతో మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం (సుబ్బా రావు) భార్య కాల్తిరెడ్డి జయలక్ష్మి
లు మండపం పంచాయతీ సర్పం చ్ పదవికి పోటీలో వున్నారు.           
       ఇక త్యాగాల్లేవ్….ఉన్నదల్లా ఓన్లీ తెగించడాలే. ఇవ్వాల్సినంత ఇచ్చేశాం, చేయాల్సిన దానికంటే ఎక్కువే చేసేశాం. ఇప్పుడిక తగ్గే దేలే అంటున్నారట బీజేపీ నా యకులు. టీడీపీకి బలం లేని చో ట వాళ్ళకే అంతుంటే…వైసీపీకి గ ట్టి పోటీ ఇచ్చే గెలిచే సత్తా ఉన్న 
తామెందుకు తగ్గాలి  ?  అంటూ టీడీపీని బీజేపీ  ప్రశ్నిస్తోంది. అం తర్గతంగా ఎన్ని తేడాలున్నా, ఎ లాంటి అభిప్రాయ భేదాలున్నా ….పెద్దోళ్ళు చెప్పారనో, పరువు పోతుందనో…ఇన్నాళ్ళు సర్దుకు పోయామంటున్న బీజేపీ నేతలు కొందరు ఇప్పుడు నో అంటున్నా రట. స్థానిక ఎన్నికలు జరగబో తున్న టైంలో…ఇక త్యాగాల్లేవ్‌… ఓన్లీ తెగించడాలేనని బీజేపీ నా యకులు తెగేసి చెబుతున్నట్లు స మాచారం. అసెంబ్లీ ఎlన్నికల్లో టి కెట్లు త్యాగం చేసి ఇటు టీడీపీ, జనసేన  గెలుపు కోసం ఎంతో క ష్టించి పనిచేశామని, లోకల్‌ బా డీస్‌లో కూడా అదే ట్రెండ్‌ కొనసా గితే… ఇక తమ ఉనికే ప్రశ్నార్ధక మవుతుందని బీజేపీ ద్వితీయ శ్రే ణి నాయకులు భావిస్తున్నట్టు తె లుస్తోంది. అయితే బీజేపీ నాయ కుల "ఒంటెద్దు పోకడ"లతో ఇ బ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోం దని టీడీపీ శ్రేణులు రగిలిపోతు న్నారని తెలుస్తోంది. 
బరిలో ముగ్గురు లక్ష్మీలు   :
    ఇకపోతే మండపం గ్రామ పం చాయతీ ఎన్నికల బరిలో ముగ్గు రు లక్ష్మీలు పోటీలో వుండడం వి శేషం. ఈ నేపథ్యంలో సర్పంచ్ పీ ఠాన్ని ఓ లక్ష్మీ వైసీపీ అభ్యర్థి కా ల్తిరెడ్డి జయలక్ష్మి కాగా, మరో ల క్ష్మీ టీడీపీ అభ్యర్థి తాండ్ర విజయ లక్ష్మీ, ఇంకో లక్ష్మీ బీజేపీ అభ్యర్థి తిరకాల విజయలక్ష్మి. ఈ ముగ్గు రు లక్ష్మీలలో సర్పంచ్ పీఠంపై కూర్చొనే లక్ష్మీ ఎవరినేది అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇది నిర్ధారణ కావాలంటే డిసెంబ ర్ నెల 2వ తేదీ సాయంత్రం వర కు ఆగాల్సిందే మరి. ఏదేమైనా ఎవరూ ఊహించని విధంగా మండపం గ్రామ పంచాయతీ ఎ న్నికలలో బీజేపీ పోటీ చేసి కూ టమిలో భాగస్వామ్యమైన టీడీ పీకి బిగ్ షాక్ ఇచ్చింది.