ఓటు హక్కు వినియోగించుకోండి
... పోలీసుల ఫ్లాగ్ మార్చ్.…
చీపురుపల్లి మేజర్ న్యూస్ : ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోండి అంటూ చీపురుపల్లి పట్టణ పరిధిలో ఎస్సై పి ఉమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ మంగళవారం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదంటూ ప్రజలకు వివరించారు. తాము ధైర్యంగా ప్రజలకు రక్షణ కల్పిస్తామంటూ ఎస్సై ఉమా వెంకటేశ్వరరావు ప్రజలకు ధైర్యం చెప్పారు. పట్టణంలోని మెయిన్ రోడ్, లావేరు రోడ్, పిల్లపేట, రెల్లివీధి, డైలీ మార్కెట్ లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల్లో ఇటువంటి అల్లర్లకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
రిపోర్టర్ మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా