దహెగాంలో రావుల మల్లన్న భక్తుల పవిత్ర గంగా స్నానాలు
సూర్య దహెగాం: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రంలో రావుల మల్లన్న స్వామిని కులదైవంగా కొలిచే భక్తులు నేడు పవిత్ర గంగా స్నానాలు ఆచరించారు.ఈ సందర్భంగా భక్తులు సంప్రదాయ బద్ధంగా పెద్ద పట్నం, చిన్న పట్నం వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లన్న స్వామి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతుల పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేకంగా ప్రార్థించారు.
ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.