BREAKING
బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసు వివాదం పరిష్కారం .. 39 ఏళ్ల తర్వాత మర్లపూడిలో టీడీపీ జెండా రెపరెపలు.. విజయానికి యువ నాయకుడు వరదబండి వెంకటేశ్వర్లు రెడ్డి కృషి కీలకం! కష్టాల్లో ఉన్న కుటుంబానికి జిల్లా కలెక్టర్ చేయూత పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం - మోటివేషన్ ట్రైనర్ ఎస్ ధర్మారెడ్డి సూర్యవంశీ సిక్సర్ల సునామీ.. డాక్టర్ తలారి రంగయ్య పై అసత్య ప్రచారాలు తగవు... సిబిఐ విచారణకు సిద్ధమా? దహెగాంలో రావుల మల్లన్న భక్తుల పవిత్ర గంగా స్నానాలు టీడీపీకి బీజేపీ బిగ్ షాక్..! -కూటమిలో కుదరని పొత్తులు..!! మండపం బరిలో ముగ్గురు లక్ష్మీలు...!!! అపస్మా నూతన కార్యవర్గ ఎంపిక ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఏకగ్రీవ సర్పంచ్. కార్మిక హక్కుల రక్షణ కోసం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటి యు ఆధ్వర్యంలో ర్యాలీ ఓటు హక్కు వినియోగించుకోండి వైసీపిని వీడి టీడీపీలోకి భారీగా చేరికలు డేంజర్ జోన్ ఇళ్ల జాబితా పై భూ నిర్వాసితుల ఆందోళన-846 ఇళ్ల గుర్తింపు పై గ్రామ సభలో అభ్యంతరాలు-18 ఏళ్లు నిండిన పిల్లలకు ప్యాకేజీ వర్తింప చేయాలని డిమాండ్ వైభవంగా సామూహిక శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం

కార్మిక హక్కుల రక్షణ కోసం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటి యు ఆధ్వర్యంలో ర్యాలీ

Select Suryaa Now
కార్మిక హక్కుల రక్షణ కోసం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటి యు ఆధ్వర్యంలో ర్యాలీ

 

  మర్రిపాడు మేజర్ న్యూస్:  కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ,ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబర్ 1, 2, 3 తేదీలలో జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో, వై ఎం సి ఏ గ్రౌండ్ నుండి మద్రాసు బస్టాండ్ నెహ్రూ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. 
   ఈ సందర్భంగా సిఐటియు రూరల్ అధ్యక్ష కార్యదర్శులు ఎం. సుధాకర్, కె .పెంచల నరసయ్య మాట్లాడుతూ దేశంలో సంపద సృష్టిస్తున్న కార్మిక వర్గానికి ఉన్న హక్కులన్నీ తీసివేసి 29 కార్మిక చట్టాలను రద్దుచేసి, నాలుగు లేబర్ కోడ్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కార్మికులకు రక్షణగా ఉన్న చట్టాలను రద్దుచేసి, కార్పొరేట్ కంపెనీలకు రక్షణ కల్పిస్తామనడం ఎంతవరకు సమంజసం. అందుకే కార్మికులకు నష్టం చేస్తున్న నాలుగు లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు .అదేవిధంగా నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి .కార్మికుల వేతనాలు మాత్రం పెంచడం లేదు. మున్సిపల్ కార్మికులు, స్కీం వర్కర్స్ కి జీతాలు పెంచకపోవడం వలన తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు .కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు మరియు స్కీం వర్కర్స్ ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ,కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయకుండా, సమాన పనికి సమాన వేతనం చెల్లించకుండా వారి శ్రమను దోచుకుంటున్నారు. వీరందరిని రెగ్యులరైజ్ చేయాలన్నారు. అసంఘటిత రంగ  కార్మికులైన ఆటో, ముఠా, తోపుడు బళ్ళు ,భవన నిర్మాణ కార్మికులకు సమగ్ర చట్టం చేసి ,సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు .కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం డిసెంబర్ 1న జరుగుతున్న చలో ఢిల్లీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
    ఈ కార్యక్రమంలో సిఐటియు ఉపాధ్యక్షులు కొండా ప్రసాద్, ఖాజావలి, సునీల్ ,వజ్రమ్మ, లవన్ కుమార్ ,సురేష్, రమాదేవి ,గిరి ,చెన్నయ్య,భరత్ తదితరులు పాల్గొన్నారు.