BREAKING
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో యూఏఈ టాస్ గెలిచి బ్యాటింగ్.. హర్‌ప్రీత్ సెంచరీ, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి - కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావినిల సత్యనారాయణ బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసు వివాదం పరిష్కారం .. 39 ఏళ్ల తర్వాత మర్లపూడిలో టీడీపీ జెండా రెపరెపలు.. విజయానికి యువ నాయకుడు వరదబండి వెంకటేశ్వర్లు రెడ్డి కృషి కీలకం! కష్టాల్లో ఉన్న కుటుంబానికి జిల్లా కలెక్టర్ చేయూత పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం - మోటివేషన్ ట్రైనర్ ఎస్ ధర్మారెడ్డి సూర్యవంశీ సిక్సర్ల సునామీ.. డాక్టర్ తలారి రంగయ్య పై అసత్య ప్రచారాలు తగవు... సిబిఐ విచారణకు సిద్ధమా? దహెగాంలో రావుల మల్లన్న భక్తుల పవిత్ర గంగా స్నానాలు టీడీపీకి బీజేపీ బిగ్ షాక్..! -కూటమిలో కుదరని పొత్తులు..!! మండపం బరిలో ముగ్గురు లక్ష్మీలు...!!! అపస్మా నూతన కార్యవర్గ ఎంపిక ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఏకగ్రీవ సర్పంచ్. కార్మిక హక్కుల రక్షణ కోసం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటి యు ఆధ్వర్యంలో ర్యాలీ ఓటు హక్కు వినియోగించుకోండి వైసీపిని వీడి టీడీపీలోకి భారీగా చేరికలు

అపస్మా నూతన కార్యవర్గ ఎంపిక

Select Suryaa Now
అపస్మా నూతన కార్యవర్గ ఎంపిక


వింజమూరు మేజర్ న్యూస్                   వింజమూరు ఎస్ వి కన్వెన్షన్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్  స్కూల్స్ అసోసియేషన్ ఉదయగిరి నియోజకవర్గ అధ్యక్షుడు కెవి రత్నం  ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి రాష్ట్ర సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎం.వి సుబ్బారెడ్డి , స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ రమణా రెడ్డి, జిల్లా సెక్రెటరీ రామ్మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షులు గోపాల్ రెడ్డి  ఉదయగిరి నియోజకవర్గ కరస్పాండెంట్స్ ఆధ్వర్యంలో ఈ ఎంపిక కార్యక్రమం జరిగింది .  ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ అపస్మా నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగినది. అపస్మా ఉదయగిరి నియోజకవర్గ నూతన అధ్యక్షుడిగా దుత్తలూరు సిద్ధార్థ స్కూల్ పాఠశాల కరస్పాండెంట్ కె. ఉదయ శంకర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గా కలిగిరి న్యూ ఇన్ఫాంట్ జీసస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ డి. విష్ణువర్ధన్ రెడ్డి, సెక్రటరీగా సీతారామపురం కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ జె.కురిచేన్, కోశాధికారి గా  సరస్వతి పాఠశాల కరస్పాండెంట్ పి.అంకిరెడ్డి, జాయింట్ సెక్రటరీగా ఉదయగిరి హోలీ ఏంజెల్స్  కరస్పాండెంట్ వి. సుధాకర్ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు కె. ఉదయ శంకర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో అందరి సహకారంతో ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు. నూతన కార్యవర్గ సభ్యులను కార్యక్రమానికి విచ్చేసిన అతిధులు , పాఠశాలల కరెస్పాండెంట్స్ నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు..