BREAKING
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో యూఏఈ టాస్ గెలిచి బ్యాటింగ్.. హర్‌ప్రీత్ సెంచరీ, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి - కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావినిల సత్యనారాయణ బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసు వివాదం పరిష్కారం .. 39 ఏళ్ల తర్వాత మర్లపూడిలో టీడీపీ జెండా రెపరెపలు.. విజయానికి యువ నాయకుడు వరదబండి వెంకటేశ్వర్లు రెడ్డి కృషి కీలకం! కష్టాల్లో ఉన్న కుటుంబానికి జిల్లా కలెక్టర్ చేయూత పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం - మోటివేషన్ ట్రైనర్ ఎస్ ధర్మారెడ్డి సూర్యవంశీ సిక్సర్ల సునామీ.. డాక్టర్ తలారి రంగయ్య పై అసత్య ప్రచారాలు తగవు... సిబిఐ విచారణకు సిద్ధమా? దహెగాంలో రావుల మల్లన్న భక్తుల పవిత్ర గంగా స్నానాలు టీడీపీకి బీజేపీ బిగ్ షాక్..! -కూటమిలో కుదరని పొత్తులు..!! మండపం బరిలో ముగ్గురు లక్ష్మీలు...!!! అపస్మా నూతన కార్యవర్గ ఎంపిక ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఏకగ్రీవ సర్పంచ్. కార్మిక హక్కుల రక్షణ కోసం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటి యు ఆధ్వర్యంలో ర్యాలీ ఓటు హక్కు వినియోగించుకోండి వైసీపిని వీడి టీడీపీలోకి భారీగా చేరికలు

డాక్టర్ తలారి రంగయ్య పై అసత్య ప్రచారాలు తగవు... సిబిఐ విచారణకు సిద్ధమా?

Select Suryaa Now
డాక్టర్ తలారి రంగయ్య పై  అసత్య ప్రచారాలు తగవు... సిబిఐ విచారణకు సిద్ధమా?

కళ్యాణదుర్గం: మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాల ద్వారా జరుగుతున్న ప్రచారాలపై ఆయన అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత విద్యాభ్యాసం చేసి గ్రూప్‌-1 అధికారిగా పనిచేసిన తలారి రంగయ్య ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చారని, ఆయన సేవలను గుర్తించకుండా వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు చేయడం సరికాదని పేర్కొంటున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తలారి రంగయ్య తన ఎంపీ పదవీకాలంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని ఆయన అభిమానులు గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా ఎంపీ నిధులతో పలు గ్రామాలు, వీధుల్లో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ వీధి దీపాలు నేటికీ ప్రజలకు వెలుగులు అందిస్తున్నాయని చెబుతున్నారు. గతంలో సరైన వీధి దీపాల సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొన్న గ్రామీణ ప్రాంతాలకు ఈ దీపాల ఏర్పాటు ఎంతో ఉపయోగపడిందని పేర్కొంటున్నారు. వీధి దీపాల ఏర్పాటులో అవకతవకలు జరిగాయంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సమగ్ర విచారణ జరగాలని తలారి రంగయ్య అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం, సంబంధిత ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారంపై స్పందించాలని కోరుతున్నారు. అవసరమైతే సీబీఐతో విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని బహిరంగ సవాల్ విసురుతున్నారు. తలారి రంగయ్యపై చేస్తున్న ఆరోపణల్లో నిజానిజాలు విచారణ ద్వారా తేలాలని, రాజకీయ కక్ష సాధింపులకు సామాజిక మాధ్యమాలను వేదికగా మార్చుకోవడం మానుకోవాలని వారు సూచిస్తున్నారు. నకిలీ ఖాతాల ద్వారా వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు ప్రజాస్వామ్య రాజకీయాలకు మంచిది కాదని పేర్కొంటున్నారు. ప్రజలకు చేసిన సేవలు, చేపట్టిన అభివృద్ధి పనులే నాయకుడి పనితీరుకు గీటురాళ్లని చెబుతున్నారు. ఏ విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్న తలారి రంగయ్య అభిమానులు, ఆరోపణలు చేస్తున్న వారు కూడా విచారణకు సహకరించాలని కోరుతున్నారు. రాజకీయ విమర్శలు విధానాలు, అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల ఆధారంగా ఉండాలే తప్ప వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఉండకూడదని హితవు పలుకుతున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు పారదర్శకంగా విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని వారు కోరుతున్నారు.