sports
సూర్యవంశీ సిక్సర్ల సునామీ..
నవంబర్ 24: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో వైభవ్ కేవలం 16 బంతుల్లోనే అర్ధశతకం బాది ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించాడు.
లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్ ఏ జట్టుకు వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే మెరుపు ఆరంభాన్నిచ్చాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే యూఏఈ బౌలర్లపై విరుచుకుపడుతూ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 18 బంతులు ఎదుర్కొన్న వైభవ్ ఏకంగా 9 భారీ సిక్సర్లతో 64 పరుగులు చేసి అజేయంగా క్రీజులో కొనసాగుతున్నాడు. వైభవ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్ ఏ జట్టు కేవలం 4 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 79 పరుగులు చేసి లక్ష్యం దిశగా దూసుకుపోతోంది.