BREAKING
అగ్రిగోల్డ్ బాధితుల నిరీక్షణకు తెర-ఈనెల 25 నుంచి బాండ్ల పరిశీలన-వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ .శ్వేత అండాల అక్రమ సేకరణ కేసులో డాక్టర్ పద్మజకు షాక్‌ ప్రమాద భరితంగా గంగవరం రోడ్డు పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలింగ్ రోజున స్థానిక సెలవు నాన్న కాదు.. ఆయనే నా ఫేవరెట్ క్రికెటర్.. విరాట్ కోహ్లిపై ఆర్యవీర్ సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు శ్రీ దత్త సాయి ఆలయంలో కార్తిక పౌర్ణమి వేడుకలు ఘనంగా సెంచూరియన్‌లో కగిసో రబాడా సరికొత్త చరిత్ర.. డేల్ స్టెయిన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు! కళ్యాణదుర్గం పట్టణంలో సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం. శివాలయంలో భక్తి పరవశం - కార్తీక పౌర్ణమి వేళ ఇస్గాం శివాలయానికి పోటెత్తిన భక్తులు గోపాలపూర్ లో వికసించిన అరుదైన బ్రహ్మ కమలం సూపర్‌మేన్‌లా డైవ్ చేసి కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన కుమార్ కుషాగ్ర.. యూఏఈ మ్యాచ్‌లో అద్భుతం! కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో యూఏఈ టాస్ గెలిచి బ్యాటింగ్.. హర్‌ప్రీత్ సెంచరీ, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం! ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి - కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావినిల సత్యనారాయణ బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసు వివాదం పరిష్కారం ..

ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి - కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావినిల సత్యనారాయణ

Select Suryaa Now
ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి - కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావినిల సత్యనారాయణ

సూర్య వీణవంక: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావినిల సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించుకోవాలని ఆయన సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమ పాలన అందిస్తోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, చేయూత పింఛన్లు, రైతులకు రైతు భరోసా, రైతు రుణమాఫీ వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తామని వావినిల సత్యనారాయణ పేర్కొన్నారు.