కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
సూర్య యైటింక్లయిన్ కాలనీ: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని హనుమాన్ నగర్‌లోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తెల్లవారుజామున స్వామివారికి మహా అభిషేకం, ప్రత్యేక అలంకరణ, అర్చనలు, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో దీపారాధన, కార్తీక దీపోత్సవం వైభవంగా జరిపారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
కార్తీక మాస పవిత్రతను చాటుతూ భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి భక్తి పారవశ్యంలో స్వామివారి ఆశీస్సులు పొందారు. దీంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సుమంత్ కుమార్ ఆచార్యులు, 18వ వార్డు కార్పొరేటర్, ఆలయ గౌరవ అధ్యక్షులు దేవనపల్లి చక్రపాణి, ఆలయ అధ్యక్షులు వేముల మల్లేశం, ఉపాధ్యక్షులు బంగారి శివ, మార్క రాజు, ప్రధాన కార్యదర్శి తొర్రికొండ నరేష్, కోశాధికారి వెంకటేష్‌తో పాటు స్రవంతి, అరుణ, లక్ష్మి, వందన, గీత, నరసింగరావు, దేవా రెడ్డి, క్రాంతి, మల్లేష్, అనిల్, రాఘవేంద్ర, నవీన్, రజినీకాంత్, శ్రీధర్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులందరికీ ఆలయ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.