BREAKING
ఘనంగా తులసి దామోదర కళ్యాణం ఆసీస్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.. ఓపెనర్ల విధ్వంసంతో సిరీస్ సమం ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో వైభవ్ సూర్యవంశీ ఊచకోత.. 28 బంతుల్లోనే మెరుపు సెంచరీ కార్మికుల భద్రతకు సింగరేణి పెద్దపీట - ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె. నిరోష కందకుర్తి నది వద్ద సంతరించుకున్న కార్తీక శోభ కపిల్స్ కిచెన్ ను ప్రారంభించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో హర్ప్రీత్ సింగ్ భాటియా మెరుపు సెంచరీ.. యూఏఈ పోరాటం ఇలా బీజేవైఎం మండల అధ్యక్షులుగా చిట్యాల విజయ్ కుమార్ స్వర్ణ గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు భారత్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా.. కరారా ఓవల్‌లో అత్యధిక టీ20 స్కోరు! రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎస్‌ఐఆర్‌ పేరుతో కాలరాస్తారా? మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మా వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు.. పూర్తి సహకారం అందిస్తాం. మున్సిపల్ చైర్మన్. ఐపీఎల్ 2027కు న్యూజిలాండ్ స్టార్ పేసర్ గుడ్‌బై.. సీఎస్కే రిలీజ్ చేయగానే పీఎస్ఎల్‌తో భారీ డీల్! ఎన్డీయే కూటమి ఐక్యతతోనే గ్రామాల అభివృద్ధి శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి వేడుకలు

స్వేచ్ఛాయుత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం!

Select Suryaa Now
స్వేచ్ఛాయుత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం!

- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె దినేష్ కుమార్, ఎస్పీ కే చక్రవర్తి 
- ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ పునీత్ వీడియో కాన్ఫరెన్స్!

రంపచోడవరం సూర్య ప్రతినిధి : రెండవ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పోలవరం జిల్లాలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్, ఎస్పీ కె చక్రవర్తి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వివరించారు.  మంగళవారం విజయవాడ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ పునీత్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోని కలెక్టర్ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి, జిల్లా పంచాయతీ అధికారి జి. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

పోస్టల్ బ్యాలెట్ల భద్రతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సూచనలు
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ పునీత్ మాట్లాడుతూ, పోలైన పోస్టల్ బ్యాలెట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన సూచనల సంకలనం  ప్రకారం అన్ని మార్గదర్శకాలను పాటిస్తూ అత్యంత భద్రతతో తిరిగి తీసుకురావాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీలు, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఒకటి, రెండు ఓట్ల తేడాతోనే కాకుండా పది కంటే తక్కువ ఓట్ల తేడాతో కూడా అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ల నిర్వహణలో ప్రతి దశలోనూ పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహిత ప్రాతిపదికన జరుగుతున్నందున బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థి పేరు లేదా పార్టీ పేరు ఉండదని, కేవలం సీరియల్ నంబర్, గుర్తు మాత్రమే ఉంటాయని తెలిపారు. ఈ నేపథ్యంలో బ్యాలెట్ పేపర్ల పంపిణీ, పోలింగ్, సేకరణ, భద్రపరచడం వంటి అన్ని ప్రక్రియలను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.
జిల్లాలో తొలి విడతలో అడ్డతీగల, దేవీపట్నం, గంగవరం, రాజవొమ్మంగి, రంపచోడవరం ఐదు మండలాల పరిధిలో 91 గ్రామ పంచాయతీలు, 850 పోలింగ్ స్టేషన్లు ఉండగా, ఏకగ్రీవమైన స్థానాలను మినహాయించి 88 గ్రామ పంచాయతీల్లో 826 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమయ్యామని కలెక్టర్ కె దినేష్ కుమార్ వివరించారు.కొండపల్లి (రాజవొమ్మంగి మండలం), వీరవరం (అడ్డతీగల మండలం), జియ్యంపాలెం (గంగవరం మండలం) గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయని, జగన్నాధపాలెంలో సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైందని వివరించారు. అదేవిధంగా మొత్తం 116 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును ఎంసీసీ, ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ తదితర బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, అన్ని స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లు 24 గంటల పాటు పనిచేస్తున్నాయని తెలిపారు.పోలవరం జిల్లా పరిధిలో రెండు విడతల్లో మొత్తం 12 మండలాల్లో 186 గ్రామ పంచాయతీలు, 1,734 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె దినేష్ కుమార్ తెలిపారు. మొత్తం 2,78,545 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకో నున్నారని, ఇందుకోసం 1,911 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశామన్నారు. తొలి విడతలో 1,35,562 మంది ఓటర్ల కోసం 924 బ్యాలెట్ బాక్సులు, రెండవ విడతలో 1,42,983 మంది ఓటర్లు, 987 బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని వివరించారు.ఎన్నికల సందర్భంగా రెండు విడతల్లోనూ శాంతిభద్రతల పరిరక్షణకు చేపట్టిన చర్యలు, పోలీసు బందోబస్తు, సున్నితమైన మరియు అత్యంత సున్నితమైన పోలింగ్ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వివరించారు. 
తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 44 గంటల ముందుగానే ప్రచారం ముగించాల్సి ఉన్నందున, మంగళవారం సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు.