BREAKING
ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవాలి: కేంబ్రిడ్జ్‌ ఎగ్జామినర్ ఎస్తర్‌ స్టాన్లీ షాహిద్ కపూర్ గ్యారేజీలోకి రూ.3 కోట్ల లగ్జరీ కారు.. ప్రత్యేకతలివే గ్రామపంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి యశ్ మాస్టర్ 'హే కన్నమ్మా' మూవీ ట్రైలర్ విడుదల.. నవంబర్ 27న థియేటర్లలోకి వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. లిస్ట్-A క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలు! చినుకుపడితే చెరువులా మారాల్సిందే ఘనంగా తులసి దామోదర కళ్యాణం ఆసీస్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.. ఓపెనర్ల విధ్వంసంతో సిరీస్ సమం ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో వైభవ్ సూర్యవంశీ ఊచకోత.. 28 బంతుల్లోనే మెరుపు సెంచరీ కార్మికుల భద్రతకు సింగరేణి పెద్దపీట - ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె. నిరోష కందకుర్తి నది వద్ద సంతరించుకున్న కార్తీక శోభ కపిల్స్ కిచెన్ ను ప్రారంభించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో హర్ప్రీత్ సింగ్ భాటియా మెరుపు సెంచరీ.. యూఏఈ పోరాటం ఇలా బీజేవైఎం మండల అధ్యక్షులుగా చిట్యాల విజయ్ కుమార్ స్వర్ణ గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు

బీజేవైఎం మండల అధ్యక్షులుగా చిట్యాల విజయ్ కుమార్

Select Suryaa Now
బీజేవైఎం మండల అధ్యక్షులుగా చిట్యాల విజయ్ కుమార్

టేకుముట్ల, మేజర్ న్యూస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని పెద్దంపల్లి గ్రామానికి చెందిన చిట్యాల విజయ్ కుమార్ ను బీజేవైఎం మండల అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఉడుత  నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఉడుత నాగరాజు విడుదల చేసిన ఓ ప్రకటనలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తి రెడ్డి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిశిదర్ రెడ్డి ఆదేశానుసారం మండలంలోని పెద్దంపల్లి గ్రామానికి చెందిన చిట్యాల విజయ్ కుమార్ ను భారతీయ యువ మోర్చా టేకుమట్ల  మండల అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఉడుత నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా బీజేవైఎం నూతన మండల అధ్యక్షులుగా ఎన్నికైన చిట్యాల విజయకుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నన్ను బీజేవైఎం టేకుమట్ల మండల అధ్యక్షులుగా నియమించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తి రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిశిధర్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు దేశెట్టి గోపాల్, బిజెపి సీనియర్ నాయకులు కూర సురేందర్ రెడ్డి,  బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల కుమార్, మండల నాయకులు బిజెపి సీనియర్ నాయకులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అని, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి, బిజెపి అగ్ర  నాయకుల పిలుపుమేరకు  ఎల్లవేళలా కృషి చేస్తానని  బీజేవైఎం నూతన మండల అధ్యక్షులు చిట్యాల విజయ్ కుమార్ తెలిపారు.

రిపోర్టర్; రాజ కొమరయ్య, టేకుమట్ల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా