చినుకుపడితే చెరువులా మారాల్సిందే
ఇంకొల్లు, మేజర్‌న్యూస్ :
కొద్దిపాటు చినుకులు పడితే రోడ్డు చెరువులా మారుతుంది. కడవకుదూరు రోడ్డులో నిత్య కృత్యమైంది. వర్షపు నీరు పోయే మార్గంలేక రోడ్డుపైనే గంటల తరబడి నీళ్ళు నిలబడి రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఆక్రమించిన అయ్యప్ప చెరువులోని కొంత మేర ఆక్రమణలను తొలగించి నీరు పోయే మార్గాన్ని సుగమం చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. ఆదిశగా పాలకులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. నీరు నిలబడి ఆటో నగర్, రామ్‌నగర్ కాలనీకి వెళ్ళే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, నూతల పాలకులు సమస్య పట్ల చర్య తీసుకొని సమస్యను పరిష్కరిస్తారని ఆశిద్దాం.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిబాష, ఇంకొల్లు.