గ్రామపంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
గ్రామపంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
డి పి ఓ సుధాకర్ రావు
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: ఈనెల 26వ తేదీన జిల్లాలో 9 మండలాలలో వివిధ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక, ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని డిపిఓ సుధాకర్ బాబు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు, చిత్తూరు జిల్లాలో మొదటి విడత 9 మండలాలలో సర్పంచ్ ఎన్నికలకు ఈనెల 26వ తేదీన ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆయా గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది, మధ్యాహ్నం రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది, కుప్పం నియోజకవర్గం లోని గుడిపల్లి మండలంలో 18 గ్రామ సర్పంచులు, కుప్పం మండలంలో 29 గ్రామ సర్పంచులు, రామకుప్పం 22, గ్రామ పంచాయతీలకు సర్పంచి ఎన్నిక, శాంతిపురం మండలం 23 గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నిక, పలమనేరు నియోజకవర్గం పరిధిలోని బైరెడ్డిపల్లి మండలం 21 గ్రామపంచాయతీలు సర్పంచ్ ఎన్నిక, గంగవరం మండలం16 గ్రామపంచాయతీలు సర్పంచ్ ఎన్నిక, పలమనేర్ రూరల్ పరిధిలో 10 గ్రామపంచాయతీలు సర్పంచి ఎన్నిక, పెద్దపంజాణి మండలంలో 25 గ్రామ పంచాయతీలు ఎన్నిక, వెంకటగిరి కోట మండలంలో 18 గ్రామ పంచాయతీలకు
ఎన్నికల నిర్వహించడం జరుగుతుంది,182 సర్పంచులకు,1908 వార్డు మెంబర్లకు ఎన్నికల నిర్వహించడం జరుగుతుందని,72,101 మంది ఓటర్లు ఓటును సద్వినియోగం చేసుకుంటారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వుల మేరకు 9 మండలాలకి జిల్లా అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించడం జరిగింది, ఈనెల 25వ తేదీన రిసెప్షన్ సెంటర్ ద్వారా ఎన్నికల సిబ్బంది పోలింగ్ మెటీరియల్ తీసుకొని ఆయా గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక బందోబస్తు ద్వారా బయలు దేరి వెళ్తారని ఓ ప్రకటనలో తెలిపారు.
ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.