BREAKING
మహేశ్ బాబు లేటెస్ట్ లుక్‌పై ఫ్యాన్స్ ఆందోళన.. ఆ డైరెక్టర్ కోసమే ఇంతలా మారిపోయారా? ఇండియన్ రెడ్‌క్రాస్ సేవలను మరింత విస్తరించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి సిబ్బందికి రెండో విడత రాండమైజేషన్ ను పూర్తి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి. రైతులకు ఫెర్టిలైజర్ సేల్స్ యాప్‌పై అవగాహన!: వైకాపా సర్పంచి అభ్యర్థి నామినేషన్‌ ఆమోదం పోస్టల్ బ్యాలెట్ నిర్వహణను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి కత్తెర గుర్తుపై ఓటేసి ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా! హైదరాబాద్‌లోని రూ.12 కోట్ల ఇంటిని అమ్మేసిన అనుష్క శెట్టి.. టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పినట్లేనా? ఈ నెల 29న కాగజ్ నగర్ లో రౌండ్ టేబుల్ సమావేశం మండలంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు అనుమతి లేని "కోకా"ను తొలగించడంలో అధికారుల నిర్లక్ష్యం బడి మెట్టు ఎక్కిన మెగా ప్రిన్సెస్.. క్లీంకార క్యూట్ వీడియో వైరల్ కన్నుల పండుగ గా కార్తీక  పౌర్ణమి జాతర - వేలాదిగా తరలి వచ్చిన భక్తులు జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీక్షణ సమావేశం వైభవ్‌ ఊచకోత.. 52 బంతుల్లో డబుల్‌ సెంచరీ! లిస్ట్‌-ఎ క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు

ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవాలి: కేంబ్రిడ్జ్‌ ఎగ్జామినర్ ఎస్తర్‌ స్టాన్లీ

Select Suryaa Now
ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవాలి: కేంబ్రిడ్జ్‌ ఎగ్జామినర్ ఎస్తర్‌ స్టాన్లీ

గుంటూరు : విద్యార్థులు తమ విద్యాభ్యాసంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ఆంగ్ల భాషా నైపుణ్యాలను నిరంతరం మెరుగు పరుచుకోవాలని కేంబ్రిడ్జ్‌ ఎగ్జామినర్, సీనియర్‌ ఎడ్యుకేషన్‌ లీడర్, అకడమిక్‌ ట్రైనర్‌ ఎస్తర్‌ స్టాన్లీ అన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో కేంబ్రిడ్జ్‌ అథరైజ్డ్‌ ఎగ్జామ్‌ సెంటర్‌ – ఐఎన్‌269 ఆధ్వర్యంలో బి.టెక్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థుల కోసం నిర్వహించిన బి1 ప్రిలిమినరీ (పీఈటీ) ఓరియంటేషన్‌ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్తర్‌ స్టాన్లీ మాట్లాడుతూ, ఆంగ్ల భాషపై పట్టు సాధించడం అనేది కేవలం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికే పరిమితం కాకుండా, ఉన్నత విద్య, ఉద్యోగావకా శాలు, అంతర్జాతీయ వేదికలపై తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు చదవడం, రాయడం, వినడం, మాట్లాడటం వంటి నాలుగు ప్రధాన భాషా నైపుణ్యాలను సమన్వయంతో అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కేంబ్రిడ్జ్‌ బి1 ప్రిలిమినరీ పరీక్ష ద్వారా విద్యార్థుల ఆంగ్ల భాషా సామర్థ్యాలను క్రమబద్ధంగా అంచనా వేయడంతో పాటు, వారి భాషా ప్రావీణ్యాన్ని తదుపరి స్థాయికి తీసు కెళ్లేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. మరో ముఖ్య అతిథి సర్టిఫైడ్‌ టీఈఎఫ్‌ఎల్‌ ట్రైనర్, బీఈసీ ప్రిలిమినరీ, వాంటేజ్‌ స్పీకింగ్‌ ఎగ్జామినర్‌ సత్య ధారిణి ఎస్‌ మాట్లాడుతూ ఆంగ్లంలో మాట్లాడేటప్పుడు విద్యార్థులు ఎలాంటి సంకోచం, భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో తమ అభిప్రాయాలను వ్యక్తపరచాలని అన్నారు. భాషా నైపుణ్యాలు ఒక్కరోజులో సాధ్యమయ్యేవి కావని, నిరంతర సాధన, సరైన ఉచ్చారణ, పదజాలాన్ని పెంపొందించుకోవడం, రోజువారీ సంభాషణల్లో ఆంగ్లాన్ని ఉపయోగించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని వివరించారు. బి1 ప్రిలిమినరీ పరీక్షా విధానం, దాని వివిధ విభాగాలు, పరీక్షకు సిద్ధమయ్యే పద్ధతులు, సమయ నిర్వహణ, స్పీకింగ్‌ విభాగంలో పాటించాల్సిన మెళకువలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ ఓరియంటేషన్‌ కార్యక్రమంలో బి1 ప్రిలిమినరీ (పీఈటీ) పరీక్షా విధానం, పరీక్షలో ఎదురయ్యే ప్రశ్నల స్వరూపం, సమర్థవంతమైన ప్రిపరేషన్‌ వ్యూహాలు, పరీక్షలో మెరుగైన ప్రతిభ కనబరిచేందుకు అనుసరించాల్సిన పద్ధతులను నిపుణులు వివరించారు. విద్యార్థులు తమ ఆంగ్ల భాషా సామర్థ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ, భవిష్యత్తులో ఉన్నత విద్య, అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకునేలా తమను తాము తీర్చిదిద్దుకోవాలని సూచించారు.అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

 

సూర్య నాయక్