ఘనంగా తులసి దామోదర కళ్యాణం
ఇస్కాన్ టెంపుల్ లోఘనంగా తులసి దామోదర్ కళ్యాణం
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
మండలంలోని హరినగరం సమీపంలోని ఇస్కాన్ టెంపుల్ లో మంగళవారం ఘనంగా తులసీ దామోదర కళ్యాణం, కనుల పండుగ జరిగింది. ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు చంద్రకేశవదాసు ప్రభు ఆధ్వర్యంలో అహోబిలం ప్రధాన అర్చకులు వేణు గోపాలన్ ఆధ్వర్యంలో అర్చక బృందం కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం ప్రత్యేక ప్రవచనం అనంతరం కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులందరికీ మధ్యాహ్నం అన్న వితరణ చేశారు . మహిళా మాతృ మూర్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా