BREAKING
చినుకుపడితే చెరువులా మారాల్సిందే ఘనంగా తులసి దామోదర కళ్యాణం ఆసీస్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.. ఓపెనర్ల విధ్వంసంతో సిరీస్ సమం ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో వైభవ్ సూర్యవంశీ ఊచకోత.. 28 బంతుల్లోనే మెరుపు సెంచరీ కార్మికుల భద్రతకు సింగరేణి పెద్దపీట - ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె. నిరోష కందకుర్తి నది వద్ద సంతరించుకున్న కార్తీక శోభ కపిల్స్ కిచెన్ ను ప్రారంభించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో హర్ప్రీత్ సింగ్ భాటియా మెరుపు సెంచరీ.. యూఏఈ పోరాటం ఇలా బీజేవైఎం మండల అధ్యక్షులుగా చిట్యాల విజయ్ కుమార్ స్వర్ణ గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు భారత్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా.. కరారా ఓవల్‌లో అత్యధిక టీ20 స్కోరు! రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎస్‌ఐఆర్‌ పేరుతో కాలరాస్తారా? మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మా వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు.. పూర్తి సహకారం అందిస్తాం. మున్సిపల్ చైర్మన్. ఐపీఎల్ 2027కు న్యూజిలాండ్ స్టార్ పేసర్ గుడ్‌బై.. సీఎస్కే రిలీజ్ చేయగానే పీఎస్ఎల్‌తో భారీ డీల్! ఎన్డీయే కూటమి ఐక్యతతోనే గ్రామాల అభివృద్ధి

భార్యపై అనుమానం... ఆస్తి కోసం అత్తపై కత్తితో దాడి-అల్లుడు రాజేష్ అరెస్ట్ రిమాండ్ కు తరలింపు

Select Suryaa Now
భార్యపై అనుమానం... ఆస్తి కోసం అత్తపై కత్తితో దాడి-అల్లుడు రాజేష్ అరెస్ట్ రిమాండ్ కు తరలింపు

మల్లంపల్లి, మేజర్ న్యూస్, భార్యపై అనుమానం, ఆస్తి వివాదం నేపథ్యంలో అత్తపై అల్లుడు కత్తితో దాడి చేసిన ఘటన మల్లంపల్లి మండల కేంద్రంలో కలకలం రేపింది. ఈ ఘటనలో బత్తిని లక్ష్మి (60) తీవ్రంగా గాయపడగా, హనుమకొండలోని ఎన్‌ఎస్‌ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.పోలీసుల వివరాల ప్రకారం.. మల్లంపల్లికి చెందిన దూమల రాజేష్ (37)కు బత్తిని మానసతో 13 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న రాజేష్ వేధింపులకు గురిచేయడంతో మానస ఏప్రిల్ 1 నుంచి పుట్టింట్లో ఉంటోంది. ఇదిలా ఉండగా, గతంలో భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన భూమి, ఇంటిని తిరిగి తన పేరు మీద మార్చాలని రాజేష్ ఒత్తిడి చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ క్రమంలో సోమవారం సాయంత్రం భార్య ఇంటికి వెళ్లి గొడవపడి చంపుతానని బెదిరించినట్లు పేర్కొన్నారు. ముందస్తు పథకంతో ఆన్‌లైన్‌లో కత్తి కొనుగోలు చేసిన రాజేష్ మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో అత్తగారి ఇంటికి చేరుకుని తలుపు తీసిన బత్తిని లక్ష్మిపై మెడ భాగంలో కత్తితో దాడి చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్య మానసపై కూడా దాడికి యత్నించగా ఆమె తప్పించుకుని కేకలు వేసింది. దీంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకోవడంతో నిందితుడు కత్తితో పరారయ్యాడు.తీవ్రంగా గాయపడిన లక్ష్మిని కుటుంబ సభ్యులు, స్థానికులు హనుమకొండలోని ఎన్‌ఎస్‌ఆర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన ములుగు పోలీసులు గాలింపు చేపట్టి నిందితుడు రాజేష్‌ను నేరానికి ఉపయోగించిన కత్తితో సహా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు ములుగు ఎస్‌ఐ, ఎస్‌హెచ్‌ఓ ఎస్. వెంకటేశ్ తెలిపారు.

రిపోర్టర్; రాజు, మల్లంపల్లి, ములుగు జిల్లా