BREAKING
బీజేవైఎం మండల అధ్యక్షులుగా చిట్యాల విజయ్ కుమార్ స్వర్ణ గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు భారత్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా.. కరారా ఓవల్‌లో అత్యధిక టీ20 స్కోరు! రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎస్‌ఐఆర్‌ పేరుతో కాలరాస్తారా? మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మా వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు.. పూర్తి సహకారం అందిస్తాం. మున్సిపల్ చైర్మన్. ఐపీఎల్ 2027కు న్యూజిలాండ్ స్టార్ పేసర్ గుడ్‌బై.. సీఎస్కే రిలీజ్ చేయగానే పీఎస్ఎల్‌తో భారీ డీల్! ఎన్డీయే కూటమి ఐక్యతతోనే గ్రామాల అభివృద్ధి శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి వేడుకలు భార్యపై అనుమానం... ఆస్తి కోసం అత్తపై కత్తితో దాడి-అల్లుడు రాజేష్ అరెస్ట్ రిమాండ్ కు తరలింపు హర్షిత్ రాణా సహా ఇండియా ఏ ఆటగాళ్లపై పాకిస్థాన్ ఫిర్యాదు.. రైజింగ్ స్టార్స్ మ్యాచ్ వివాదం! నూతన వధూవరులను ఆశీర్వదించిన మడకశిర ఎమ్మెల్యే. స్వేచ్ఛాయుత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం! ఎరువుల దుకాణాలపై వ్యవసాయ అధికారుల ఆకస్మిక తనిఖీలు విరాట్ కోహ్లి భారీ రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజం.. ఐఎల్‌టీ20 అరంగేట్రంలోనే అదుర్స్! సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రియాంష్ ఆర్య విధ్వంసం.. టీ20లో అత్యధిక వ్యక్తిగత స్కోరుతో భారత రికార్డు!

అండాల అక్రమ సేకరణ కేసులో డాక్టర్ పద్మజకు షాక్‌

Select Suryaa Now
అండాల అక్రమ సేకరణ కేసులో డాక్టర్ పద్మజకు షాక్‌

 

ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

యాదాద్రి :అక్రమ అండాల సేకరణ వ్యవహారం పద్మజ ఫెర్టిలిటీ సెంటర్‌ యజమానులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ డాక్టర్‌ పి. పద్మజ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో ఆమెకు ఊరట లభించలేదు.తనకు అక్రమ అండాల సేకరణతో ఎలాంటి సంబంధం లేదని పద్మజ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో అరెస్టయిన ఓ నిందితుడి వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు చివరి దశలో తన పేరును నిందితురాలిగా చేర్చారని కోర్టుకు విన్నవించారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు వైద్య సేవలను నిలిపివేస్తానని, విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఆమె వాదనలకు హైకోర్టు నుంచి ఉపశమనం లభించలేదు. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.