BREAKING
చినుకుపడితే చెరువులా మారాల్సిందే ఘనంగా తులసి దామోదర కళ్యాణం ఆసీస్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.. ఓపెనర్ల విధ్వంసంతో సిరీస్ సమం ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో వైభవ్ సూర్యవంశీ ఊచకోత.. 28 బంతుల్లోనే మెరుపు సెంచరీ కార్మికుల భద్రతకు సింగరేణి పెద్దపీట - ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె. నిరోష కందకుర్తి నది వద్ద సంతరించుకున్న కార్తీక శోభ కపిల్స్ కిచెన్ ను ప్రారంభించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో హర్ప్రీత్ సింగ్ భాటియా మెరుపు సెంచరీ.. యూఏఈ పోరాటం ఇలా బీజేవైఎం మండల అధ్యక్షులుగా చిట్యాల విజయ్ కుమార్ స్వర్ణ గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు భారత్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా.. కరారా ఓవల్‌లో అత్యధిక టీ20 స్కోరు! రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎస్‌ఐఆర్‌ పేరుతో కాలరాస్తారా? మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మా వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు.. పూర్తి సహకారం అందిస్తాం. మున్సిపల్ చైర్మన్. ఐపీఎల్ 2027కు న్యూజిలాండ్ స్టార్ పేసర్ గుడ్‌బై.. సీఎస్కే రిలీజ్ చేయగానే పీఎస్ఎల్‌తో భారీ డీల్! ఎన్డీయే కూటమి ఐక్యతతోనే గ్రామాల అభివృద్ధి

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎస్‌ఐఆర్‌ పేరుతో కాలరాస్తారా? మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

Select Suryaa Now
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎస్‌ఐఆర్‌ పేరుతో కాలరాస్తారా?  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
సూర్య కరీంనగర్ ప్రతినిధి : రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పేరుతో కాలరాసే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. ప్రశ్నించే బడుగు, బలహీన వర్గాల ఓట్లను తొలగించడమే బీజేపీ లక్ష్యమని విమర్శించారు. కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ఎన్ని నిధులు తీసుకొచ్చారో, యువతకు ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.మంగళవారం కరీంనగర్‌లోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌పై పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా ప్రధాని మోదీ, అమిత్‌షా సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారని విమర్శించారు. దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేస్తూ యువతను రెచ్చగొట్టడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ విషయంలో బండి సంజయ్ ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు.బండి సంజయ్ ఉమ్మడి కరీంనగర్‌కు ఏం చేశారు? అని ప్రశ్నించిన మంత్రి.. గల్ఫ్ బాధితుల సమస్యలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువత ఉపాధి, జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధుల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో ఆయన చేసిన కృషి ఏమిటో చెప్పాలన్నారు. తాము దేవుడి పేరుతో కాకుండా అభివృద్ధి పేరుతో ప్రజల్లోకి వెళ్లి ఎన్నికలను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, నాయకులు ఎండీ తాజుద్దీన్, అహ్మద్ అలీ, వీర దేవేందర్ పటేల్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, ఎండీ ఇమ్రాన్, పోతారపు సురేందర్, కిమ్ ఫహద్, పెంట శేఖర్, షహెన్షా తదితరులు పాల్గొన్నారు.