ప్రమాద భరితంగా గంగవరం రోడ్డు
ఇంకొల్లు, మేజర్‌న్యూస్ :
ఇటీవల కురిసిన మురసు తుఫాను ధాటికి గంగవరం-ఇంకొల్లు ఆర్‌అండ్‌బి రోడ్డు దెబ్బతిని ప్రమాద భరితంగా మారింది. దగ్గుబాటి విద్యాసంస్థలు ఈ రోడ్డులోనే ఉన్నాయి. వేల మంది విద్యార్థులు కళాశాల, స్కూలు బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. గంగవరం మలుపు నుండి ఆలేరు వాగు వరకు రోడ్డు కోతకు గురైంది. కొత్తవారు ఎవరైనా ఈ రోడ్డులో ప్రయాణించాలంటే ప్రమాదాలకు గురి కాక తప్పదు. గతంలో పాలకులు ఈ రోడ్డు విస్తరణకు, వంతెనలపై దృష్టి సారించకపోవటంతో రోడ్డు మరింత కోతకు గురై ప్రమాదాలకు నిలయంగా తయారైంది. ఏ క్షణం ఏం జరుగుతుందోననే భయంతో విద్యార్థులను తల్లిదండ్రులు పాఠశాలకు పంపుతున్నారు. ఆర్‌అండ్‌బి అధికారులు రోడ్డు మరమ్మత్తులు చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఆదిశగా పాలకులు మరమ్మత్తులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిబాష, ఇంకొల్లు.